ఇటీవలే, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ ఇ-కామర్స్ వెబ్ సైట్ Flipkart లో కనిపించింది. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ స్మార్ట్ ఫోన్,ఈ రోజు మద్యాహ్నం 12 గంటలకి లాంచ్ కానుంది . ఈ సామ్రాట్ ఫోన్ను తక్కువధరకే ఒక ట్రిపుల్ కెమెరా సెటప్పుతో ఇన్ఫినిక్స్ తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు.ఇదే గనుక నిజమైతే, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి ట్రిపుల్ కెమెరా ఫోన్లతో ఇది పోటీపడవచ్చు.
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ భారతదేశంలో ఒక బడ్జెట్ ఫోనుగా అందించబడునట్లు, వస్తున్న రూమర్లు మరియు నివేదికలు తెలియచేస్తున్నాయి. ఈ నివేదికల ప్రకారం, ఈ ట్రిపుల్ కెమెరా ఈ ఫోన్ యొక్క ముఖమైన ప్రత్యేకతలలో ప్రధానమైనదిగా ఉండనుంది. అంతేకాకుండా, మంచి స్పెక్స్ తో తక్కువ ధరలో ఉన్నటువంటి ఇతర బడ్జెట్ ఫోన్లతో కూడా పోటీపడవచ్చు. అయితే, ఈ ఫోన్ ధర ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
స్మార్ట్ 3 ప్లస్ డిజైన్ గురించి చూస్తే, ఇది ఒక ప్రీమియం ఫోనులుగా కనిపిస్తుంది, ఇది ఒక 6.4-అంగుళాల వాటర్ డ్రాప్ డిస్ప్లేతో రానుంది. అలాగే, శక్తివంతమైన బ్యాటరీ మరియు ఆండ్రాయిడ్ 9 ఫై OS పైన నడుస్తుంది. ఈ విషయాలను గమనిస్తే ఈ స్మార్ట్ ఫోన్, శామ్సంగ్ గెలాక్సీ A 50, శామ్సంగ్ గెలాక్సీ M30, వివో V15 ప్రో, శామ్సంగ్ గెలాక్సీ A7 2018 మరియు శామ్సంగ్ గెలాక్సీ A9 2018 వంటి వాటిలో పోటీపడగలదు.
ఈ ఫోన్ ఒక ట్రిపుల్ వెనుక కెమెరాతో తక్కువ ధరలో రావచ్చు. అంతేకాక, సంస్థ కూడా ఇందులో నైట్ ఫోటోగ్రఫీని కూడా అందించినట్లు తెలుస్తోంది, ఇది వినియోగదారులకు గొప్ప కెమేరా అనుభవాలను పొందడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫోన్ యొక్క పెద్ద డిస్ప్లే మరియు ఆకర్షణీయమైన డిజైన్ కూడా వినియోగదారులను ఆకట్టుకుంటుంది.