32MP సెల్ఫీ, వెనుక మూడు కెమేరాలు ధర మాత్రం కేవలం రూ.6,999 మాత్రమే : మధ్యాహ్నం 12 గంటలకి సేల్

HIGHLIGHTS

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ఫోన్ 4GB RAM మరియు 64GB స్టోరేజితో వస్తుంది.

ఇటీవల, ఇన్ఫినిక్స్ సంస్థ ఇండియాలో ఒక 32MP సెల్ఫీ కెమెరా,వెనుక  ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే , 5000mAh బ్యాటరీ వంటి గొప్ప స్పెక్స్ తో,  కేవలం రూ.6,999 ధరతో వచ్చిన INFINIX HOT 8 స్మార్ట్ ఫోన్ యొక్క మరొక ఫ్లాష్ Flipkart నుండి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి జరగనుంది.  ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర మాత్రం కేవలం  6,999 రూపాయలు మాత్రమే. ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ఫోన్ 4GB RAM మరియు 64GB స్టోరేజితో వస్తుంది.

INFINIX HOT 8 ప్రత్యేకతలు

ఈ INFINIX HOT 8 స్మార్ట్ ఫోన్  ఒక 6.52 అంగుళాల HD+ IPS డ్యూ డ్రాప్ నోచ్ మరియు 720X1520 p రిజల్యూషనుతో వస్తుంది మరియు .ఇది 450 నైట్స్ బ్రైట్నెస్ టి వస్తుంది. అంతేకాదు , ఇది ఒక Eye Care మోడ్ మరియు AI రీడ్ మోడ్ తో వస్తుంది.  ఇక ఇందులో ముందు 2.5D కర్వ్డ్ గ్లాస్ రక్షణతో సంస్థ అందించింది. ఈ స్మార్ట్ఫోన్ను ఆండ్రాయిడ్ 9 ఫై మీద ఆధారితంగా XOS 5.0 చీతా తో ప్రారంభించింది మరియు ఈ పూర్తి డివైజ్ మొత్తానికి పవర్ అందించాడని ఒక పెద్ద 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 2.0Ghz వరకూ క్లాక్ అందించగల ఒక Helio P22 Octa-core 64-bit ప్రాసెసరుతో వస్తుంది. దీనికి జతగా, 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజ్ అనుసంధానంతో వస్తుంది.అధనంగా 256GB స్టోరేజిని ఒక మెమొరీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు మరియు డ్యూయల్ VoLTE కి అపార్ట్ చేస్తుంది.

ఈ  HOT 8 కెమేరాల గురించి  మాట్లాడితే,  వెనుకభాగంలో  13 మెగాపిక్సెల్ (f1.8) ప్రధాన కెమేరాకి జతగా మరొక 2MP డెప్త్ సెన్సార్ మరియు ఒక లో లైట్ సెన్సార్ జతగా కలిపిన ఒక  ట్రిపుల్ రియర్ కెమేరాని ఇందులో అందించారు. ఆటో సీన్ డిటెక్షన్, AI పోర్ట్రైట్, AI HDR, AI బ్యూటీ, AI Bokeh మరియు నైట్ షాట్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం  ఒక 8-MP AI కెమెరాని ఒక ఫ్లాష్ ని కలిగి ఉంది, దీని ఎపర్చరు f2.0 గా ఉంటుంది.

అధనపు ఫీచర్ల విషయానికి వస్తే, డివైజ్ కనెక్టివిటీ, 3.5mm ఆడియో జాక్, FM , OTG, ట్రిపుల్ సిమ్ స్లాట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచరుతో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్నుక్వజల్ షాన్ మరియు కాస్మిక్ పర్పల్ వంటి కలర్ ఎంపికల్లో కొనుగోలు చేయవచ్చు.

ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ . 6,999 రూపాయిలుగా నిర్ణయించింది మరియు ఈ ఫోన్ యొక్క అమ్మకాలను సెప్టెంబర్ 12 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి Flipkart ద్వారా జరిగించనుంది. మీరు జియో వినియోగదారులు గనుక అయితే, మీరు ఈ ఫోనుతో రూ .5200 వరకూ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే, ఇది లిమిటెడ్ పీరియడ్ అఫర్ ధర కాబట్టి, కేవలం అక్టోబర్ 31 వ తేదీ వరకు మాత్రమే అందించనుంది.      

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :