infinix hot 60 5g launch price and features india
Infinix HOT 60 5G: భారత్ లో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్న బ్రాండ్ లలో ఇన్ఫినిక్స్ కూడా ఒకటి . ఈ ఈరోజు ఈ బ్రాండ్ ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 60 5జి స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను చవక ధరలో గేమింగ్ ఫీచర్స్ మరియు AI సపోర్ట్ తో లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు వివరంగా చూద్దామా.
ఇన్ఫినిక్స్ హాట్ 60 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 10,499 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ జూలై 17వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ పై రూ. 500 రూపాయల ఆల్ బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఫోన్ కేరమెల్ గ్లో, షాడో బ్లూ, స్లీక్ బ్లాక్ మరియు టండ్రా గ్రీన్ నాలుగు రంగుల్లో లభిస్తుంది.
ఇన్ఫినిక్స్ ఈ స్మార్ట్ ఫోన్ ను రౌండ్ కార్నర్ మరియు స్లీక్ డిజైన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను 5 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ కలిగిన మీడియాటెక్ Dimensity 7020 ఆక్టాకోర్ ప్రోసెసర్ తో లాంచ్ చేసింది. ఈ చిప్ సెట్ కి జతగా 6 జీబీ ఫిజికల్ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ XOS15 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ పై నడుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ప్రత్యేకమైన ఇన్ఫినిక్స్ AI బటన్ తో కూడా వస్తుంది.
ఈ ఇన్ఫినిక్స్ లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ HD+ డిస్ప్లే తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ మరియు మంచి బ్రైట్నెస్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 90FPS గేమింగ్ సపోర్ట్ తో ఉంటుందని మరియు ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ తో వచ్చిన మొదటి ఫోన్ ఇదే అని కంపెనీ తెలిపింది.
Also Read: ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి Motorola Dolby Atmos సౌండ్ బార్ చవక ధరలో లభిస్తుంది.!
ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్ 50MP మెయిన్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 8MP సెల్ఫీ కెమెరాని LED ఫ్లాష్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ AI Cam, Beauty, సూపర్ నైట్, పోర్ట్రైట్ మరియు AIGC Portrait వంటి చాలా కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5200 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.