ఈరోజు నుండి మొదలైన బడ్జెట్ 8GB+8GB ర్యామ్ స్మార్ట్ ఫోన్ సేల్..!
బడ్జెట్ బిగ్ ర్యామ్ స్మార్ట్ ఫోన్ Infinix HOT 30i
Infinix HOT 30i ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది
ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.8999 రూపాయల ధరలో వచ్చింది
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ లేటెస్ట్ గా ఇండియాలో విడుదల చేసిన బడ్జెట్ బిగ్ ర్యామ్ స్మార్ట్ ఫోన్ Infinix HOT 30i ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.8999 రూపాయల ధరలో 8GB ర్యామ్ మరియు 8GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ తో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అని వివరాలు క్రింద చూడవచ్చు.
SurveyInfinix HOT 30i: ధర
ఇన్ఫినిక్స్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Infinix HOT 30i ను లాంచ్ అఫర్ లో భాగంగా రూ.8,999 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఏప్రిల్ 3వ తేదీ, అంటే ఈరోజు నుండి Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వచ్చింది.
Infinix HOT 30i: స్పెక్స్
ఇన్ఫినిక్స్ హాట్ 30i స్మార్ట్ ఫోన్ పెద్ద 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేని చిన్న వాటర్ డ్రాప్ నోచ్ తో కలిగివుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Helio G37 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB ర్యామ్ కి జతగా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అందించింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ లో 8GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ సపోర్ట్ ను కూడా ఇన్ఫినిక్స్ జతచేసినట్లు చెబుతోంది.
ఇన్ఫినిక్స్ హాట్ 30i లో అందించిన కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ తో వస్తుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ లో 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. సెక్యూరిటీ పరంగా ఈ ఫోన్ ఫేస్ అన్లాక్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగివుంది. ఈ ఫోన్ Android 12 OS ఆధారిత XOS 12 సాఫ్ట్ వేర్ తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 5000 mAh హెవీ బ్యాటరీని 10W టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో కలిగివుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
