MIVI One 5G: స్మార్ట్ ఫోన్ రంగంలోకి అడుగుపెట్టిన హైదరాబాద్ బేస్డ్ ఆడియో ఎలక్ట్రానిక్స్ బ్రాండ్.!

HIGHLIGHTS

హైదరాబాద్ బెస్ట్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మివి ఆడియో ప్రొడక్ట్స్ పరిధిని దాటుకుని మొబైల్ రంగంలోకి అడుగు పెట్టింది

మివి కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన కొత్త 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతోంది

ఈ ఫోన్ ను MIVI One 5G పేరుతో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

MIVI One 5G: హైదరాబాద్ బెస్ట్ ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ మివి ఇంతవరకు ఆడియో ప్రొడక్ట్స్ మాత్రమే అందించింది. అయితే, ఈ కంపెనీ ఆడియో ప్రొడక్ట్స్ పరిధిని దాటుకుని మొబైల్ రంగంలోకి అడుగు పెట్టింది. త్వరలో ఈ కంపెనీ ఇండియన్ మార్కెట్లో తన కొత్త 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతోంది. ఈ ఫోన్ ను మివి వన్ 5జి పేరుతో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

MIVI One 5G: లాంచ్ డేట్

మివి వన్ 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ని కంపెనీ ఇంకా ఫిక్స్ చేయలేనట్టుంది. అందుకే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా టీజింగ్ స్టార్ట్ చేసింది. సాధారణంగా కొత్త ఫోన్ లాంచ్ కోసం దాదాపు అన్ని కంపెనీలు కూడా చాలా కాలం ముందుగా టీజింగ్ మొదలు పెట్టి, ఈ ఫోన్ పేరును మార్కెట్ లో బాగా ప్రచారం చేసిన తర్వాత ఆ ఫోన్ ను లాంచ్ చేయడం అనాదిగా వస్తున్న మార్కెట్ ట్రిక్. ఇప్పుడు మివి కూడా ఇదే ఆచారాన్ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.

MIVI One 5G: ఫీచర్స్

మివి లాంచ్ చేయబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన టీజర్ పేజీ నుంచి ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క కొన్ని ఫీచర్స్ ని టీజింగ్ చేసింది. ఈ ఫోన్ ను లేటెస్ట్ క్వాల్కమ్ Snapdragon 5G చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ ను చాలా పటిష్టమైన డిజైన్ టి లాంచ్ చేస్తామని కూడా మివి ఈ టీజర్ పేజీ లో వెల్లడించింది.

ఈ అప్ కమింగ్ ఫోన్ డిజైన్ ని వెల్లడించే టీజర్ ఇమేజ్ ని కూడా రిలీజ్ చేసింది. ఇందులో ఈ ఫోన్ రౌండ్ కార్నర్ తో అందమైన డిజైన్ కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాదు, ఇందులో ఫోన్ చాలా స్లీక్ బెజెల్స్ కూడా కలిగి ఉన్నట్లు అర్థం అవుతుంది. ఈ ఫోన్ ను క్లీన్ సాఫ్ట్ వేర్ తో అందిస్తున్నట్లు కూడా మివి తెలిపింది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ లో ఈ ఫోన్ సరికొత్త గ్రీన్ కలర్ లో ఉన్నట్లు చూపించింది.

Also Read: Meta AI Muse Voice Transcribe: వాయిస్ మాట్లాడితే రియల్ టైంలో టెక్స్ట్‌గా మారుతుంది.!

మివి ముందు ఛార్జింగ్ కేబుల్, వాల్ ఛార్జర్ మొబైల్ యాక్సెసరీస్ తో మార్కెట్ లో అడుగుపెట్టింది. తర్వాత ఇయర్ బడ్స్ మరియు చాలా చవక ధరలో సౌండ్ బార్ తో పాటు స్పీకర్లు వంటి చాలా ఆడియో ప్రొడక్ట్స్ అందించింది. మివి Duo Pods తో చాలా ప్రాచుర్యం అందుకుంది. ఈ కంపెనీ ఇప్పుడు మొబైల్ మార్కెట్ కి అడుగు పెడుతోంది. మరి ఈ ఫోన్ ఎలా ఉంటుందో లాంచ్ తర్వాత చూడాలి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :