శామ్సంగ్ గెలాక్సీ M40 పైన భారీ డిస్కౌంట్

Updated on 27-Dec-2019
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కెమేరాతో సూపర్ స్లోమోషన్ మరియు స్లోమోషన్ వీడియోలను అద్భుతంగా చిత్రీకరించవచ్చు.

ఈ గెలాక్సీ M సిరీస్ నుండి ఒక పంచ్ హోల్ సెల్ఫీ కెమేరా మరియు వెనుక ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పుతో వచినటువంటి గెలాక్సీ M40 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు గొప్ప డిస్కౌంట్ తో అమ్ముడవుతోంది. ఇది ఇన్ఫినిటీ O అమోలెడ్ డిస్ప్లే, 3500mAh భారీ బ్యాటరీ మరియు స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలతో అత్యంత సరసమైన ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుక కెమేరాతో సూపర్ స్లోమోషన్ మరియు స్లోమోషన్ వీడియోలను అద్భుతంగా చిత్రీకరించవచ్చు. 

శామ్సంగ్ గెలాక్సీ M40  అఫర్ ధర

శామ్సంగ్ గెలాక్సీ M40 –  6GB + 128GB – Rs.16,999

వాస్తవానికి, ఈ ఫోన్ ముందుగా రూ.19,999 రుపాయల ధరతో అమ్ముడయ్యింది. అంటే ఇప్పుడు ఈ ఫోన్ 3000 రూపాయల డిస్కౌంట్ తో లభిస్తోంది.    

శామ్సంగ్ గెలాక్సీ M40 ప్రత్యేకతలు

శామ్సంగ్ గెలాక్సీ M40 స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.3 అంగుళాల ఇన్ఫినిటీ – O డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 675 ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది. ఈ ప్రొసెసరు  ట్రిపుల్ రియర్ కెమేరాకు చక్కగా అనుకూలిస్తుంది. ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 9 ఫై  పైన ఆధారితంగా సరికొత్త శామ్సంగ్ one UI  పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక  3500 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, ఇది 6GB ర్యామ్ జతగా 128GB  వేరియంటుతో మాత్రమే వస్తుంది. అలాగే, SD కార్డు ద్వారా 512GB వరకూ స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.

ఇక కెమెరావిభగానికి వస్తే, ఇది వెనుక భాగంలో 32MP +5MP+8MP  ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఇందులో 32MP ప్రధాన కెమరా ఒక f/1.7 అపర్చరుతో  ఉంటుంది. ఇంకా 5MP కెమేరా Live ఫోకస్ కోసం మరియు 8MP కెమేరా అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్లకోసం ఉపయోగపడుతుంది. ఇక ముందుభాగంలో సెల్ఫీల కోసం 16MP కెమెరాని అందించారు. సెల్ఫీలను క్లిక్ చేయడంతో పాటుగా ఇది పేస్ రికగ్నైజేషన్ కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో అందించిన వెనుక కెమెరాతో సూపర్ స్లొమాషన్ వీడియోలను, అదీకూడా 240fps వద్ద తీసుకోవచ్చు. ఈ ఫోన్ బాక్స్ లో మీకు ఒక టైప్ -C ఇయర్ ఫోన్ కూడా లభిస్తుంది.        

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :