HIGHLIGHTSషియోమికి చెందిన Redmi K 20 Pro స్మార్ట్ ఫోన్ ధర తగ్గించబడింది.
ఇప్పుడు షియోమి తన రెడ్‌మి కె 20 ప్రో ధరను భారతదేశంలో 4,000 రూపాయలు తగ్గించింది.
మీరు రెడ్‌మి కె 20 ప్రో కొనాలని ఆలోచిస్తుంటే, ఇది మీకు సువర్ణావకాశమే అవుతుంది.
భారతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం పోటీ మరింత తారాస్థాయికి చేరుకుంది. అన్ని మొబైల్ కంపెనీలు వేర్వేరు ధరల విభాగాల్లో కొనుగోలుదారులను ఆకట్టుకునే విధంగా కొత్త ఫోన్లను తీసుకువస్తున్నాయి. అయితే, ఈసారి షియోమి మధ్యతరగతి కస్టమర్లను ఆకర్షించే విధంగా కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. షియోమికి చెందిన Redmi K 20 Pro స్మార్ట్ ఫోన్ ధర తగ్గించబడింది. మీరు రెడ్‌మి కె 20 ప్రో కొనాలని ఆలోచిస్తుంటే, ఇది మీకు సువర్ణావకాశమే అవుతుంది.
ఇప్పుడు షియోమి తన రెడ్‌మి కె 20 ప్రో ధరను భారతదేశంలో 4,000 రూపాయలు తగ్గించింది. ఈ అవకాశంతో వినియోగదారులకు ఈ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి వీలుకల్పిస్తుంది. అయితే, ఈ సదుపాయాన్ని నిర్దిష్ట కాలానికి మాత్రమే అందించినట్లు సమాచారం. ఈ ధర వద్ద మీరు ఈ నెల 31 వరకు, అంటే ఈరోజు వరకూ మాత్రమే ఈ రెడ్‌మి కె 20 ప్రో ని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
అంటే, కస్టమర్లు ఇప్పుడు రెడ్‌మి కె 20 ప్రో యొక్క 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ను ఈరోజు చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయగలరు. ఈ ఆఫర్ ను అమెజాన్ ఇండియా (అమెజాన్ ఇండియా), ఫ్లిప్‌కార్ట్ (ఫ్లిప్‌కార్ట్), మి.కామ్, అన్ని రిటైల్ దుకాణాలు మరియు MI స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు.
రెడ్మి K20 ప్రో (6GB + 128GB) ధర - Rs.22,999
షావోమి ఈ రెడ్మి K20 ప్రో ఫోనులో ఒక 7 వ జనరేషన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరును పరిచయం చేసింది. ఈ K20 ప్రో స్మార్ట్ ఫోన్ ఒక 6.39 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అయితే, ఇందులో ఎటువంటి నోచ్ లేకుండా పూర్తి డిస్ప్లేతో అందించింది. ఎందుకంటే, ముందు, సెల్ఫీల కోసం పాప్ అప్ సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది. ఈ స్మార్ట్ఫోన్ 19.5: 9 ఆస్పెక్ట్ రేషియోతో మరియు 91.9 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తాయి. ఇది అత్యదికంగా 600 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ రెడ్మి K20 ప్రో యొక్క డిస్ప్లే యూట్యూబ్, Netflix మరియు PUBG వంటి వాటిలో HDR కంటెంటుకు మద్దతిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తక్షణతో అందించబడింది. అలాగే, వెనుక భాగంలో ఒక 3D కర్వ్డ్ గ్లాస్ డిజైన్ అందించింది.
ఈ ప్రో వేరియంట్ AI సహాయంతో దాని బ్యాటరీ పనితీరును పెంచే స్మార్ట్ ఆప్టిమైజేషనుతో వస్తుంది. ఇక ఛార్జింగ్ మరియు బ్యాటరీ విషయాలకు వస్తే, ఇందులో 27 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, బాక్స్ లో మాత్రం కేవలం 18వాట్స్ చార్జరును మాత్రమే అందించింది.
అదనంగా, ఈ స్మార్ట్ ఫోన్స్ ఒక 3.5 mm జాక్ మరియు రెడ్మి K20 ప్రో స్మార్ట్ఫోన్ ఒక స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్టుతో వస్తుంది. ఇది గరిష్టంగా, 2.84GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది. ఈ ఫోన్ AnTuTu పైన 3,88,803 స్కోరును సాధించినట్లు, షావోమి ప్రకటించింది.
ఈ స్మార్ట్ ఫోను యొక్క వెనుక భాగంలో ఒక ట్రిపుల్ కెమేరా సెటప్పును అందించింది. Sony IMX 586 సెన్సారుతో 48MP కెమేరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా ఇందులో వ్వబడింది. అలాగే, ఇది 8MP టెలిఫోటో లెన్స్ మరియు 13MP వైడ్ - యాంగిల్ లెన్స్ కలిగి ఉంది. ఈ కెమెరాలో అందించిన టెలిఫోటో కెమేరాతో 2X ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ముందు కెమెరా విషయానికి వస్తే, 20 MP సెల్ఫీ కెమేరా ఒక పాప్-అప్ మెకానిజంతో వస్తుంది. ఈ సెల్ఫీ కెమేరా ఒక కెమేరా ఎడ్జ్ లైటింగ్ సిస్టం తో వస్తుంది. ఇది కార్బన్ బ్లాక్, ఫ్లేమ్ రెడ్ మరియు గ్లేసియర్ బ్లూ వంటి మూడు రంగుల ఎంపికలతో లభిస్తుంది.
టాప్ -ప్రోడక్టులు
హాట్ డీల్స్
మొత్తం చూపించుDigit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.
మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.