ఆండ్రాయిడ్, గూగుల్ కంటే హువావే యోక్క హాంగ్‌మెంగ్ OS వేగంగా పనిచేస్తుందని చెబుతున్న Huawei : రిపోర్ట్

HIGHLIGHTS

ఇది స్మార్ట్‌ఫోన్లలోనే కాకుండా రౌటర్లు, నెట్‌వర్క్ స్విచ్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్లు, డేటా సెంటర్లలో కూడా ఉపయోగించవచ్చని, కంపెనీ సీఈఓ తెలిపారు.

ఆండ్రాయిడ్, గూగుల్ కంటే హువావే యోక్క హాంగ్‌మెంగ్ OS వేగంగా పనిచేస్తుందని చెబుతున్న Huawei : రిపోర్ట్

స్మార్ట్‌ ఫోన్ తయారీ సంస్థ అయిన హువావే కంపెనీ తన కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ కంటే చాలా బాగుందని ఇటీవల పేర్కొంది. ఈ విషయంలో హువావే సీఈఓ, వ్యవస్థాపకుడు అయిన, రెన్ జెంగ్ఫీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, హువావే రూపొందించిన 'Hongmeng OS' ఆండ్రాయిడ్ కంటే చాలా వేగంగా ఉందని పేర్కొన్నారు. ఇది స్మార్ట్‌ఫోన్లలోనే కాకుండా రౌటర్లు, నెట్‌వర్క్ స్విచ్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్లు, డేటా సెంటర్లలో కూడా  ఉపయోగించవచ్చని, కంపెనీ సీఈఓ తెలిపారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంతకాలంలో ఆఫర్ చేయవచ్చనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, అయితే హువావే యొక్క 'Hongmeng OS' ను త్వరలో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు. కొన్ని నివేదికల ప్రకారం, హువావే డెవలపర్ కాన్ఫరెన్స్‌లో ఈ హువావే హాంగ్‌మెంగ్ ని ప్రకటించవచ్చని తేలుస్తోంది.

మీడియా నివేదికల ప్రకారం, హువావే యొక్క CEO రెన్ జెంగ్ఫీ తన ఒక ప్రకటనలో, తన హాంగ్‌మెంగ్ ఆండ్రాయిడ్ కంటే వేగంగా ఉంటుందని మరియు ఇందులో చాలా మంచి ఆప్స్ కూడా ఉంటాయని తెలియచేశారు. అలాగే, ఇది స్మార్ట్‌ఫోన్లలో మాత్రమేకాకుండా మరిన్నింటిలోనో ఉపయోగించబడవచ్చు.

స్మార్ట్ఫోన్ తయారీదారుపై బెన్ మరియు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వ్యాపార అవకాశాల గురించి రెన్ జెంగ్ఫీ మాట్లాడారని, భవిష్యత్తులో ఈ సమస్య మళ్లీ వస్తే, ఆ సంస్థ దానికి తగినవిధంగా తనను తాను సిద్ధంగా ఉంచుకోవాలనుకుంటుంది. అంతేకాదు, హువావే తన హాంగ్‌మెంగ్ ని అభివృద్ధి చేయడానికి కూడా ఇదే కారణం.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo