Huawei Y9 Prime (2019) పాప్ అప్ సెల్ఫీ ఫోన్ ఈరోజు ఇండియాలో విడుదలకానుంది

Huawei Y9 Prime (2019) పాప్ అప్ సెల్ఫీ ఫోన్ ఈరోజు ఇండియాలో విడుదలకానుంది
HIGHLIGHTS

ఇది పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

హువావే తన మొదటి పాప్-అప్ సెల్ఫీ కెమెరా ఫోన్ అయినటువంటి Y 9 ప్రైమ్ (2019) ను ఈ రోజు భారతదేశంలో విడుదల చేస్తోంది. ఇప్పటికే, ఈ స్మార్ట్ ఫోన్ను ఇండియాలో  ప్రారంభించటానికి సంబంధించిన అనేక టీజర్‌లు వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్ను అమెజాన్ ఇండియా ద్వారా సేల్ చేయనుంది మరియు అమేజాన్ కూడా దీనికి సంబంచింది ఒక మైక్రో సైట్ పేజీని కూడా అందించింది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటించబడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ జనవరిలో లాంచ్ అయిన హువావే వై 9 (2019) స్థానంలో ఉంటుంది.

వై 9 ప్రైమ్ (2019) స్మార్ట్ ఫోన్, హువావే సంస్థ యొక్క మొట్టమొదటి పాప్ అప్ సెల్ఫీ ఫోన్. ఇది పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది మరియు రియల్మి ఎక్స్‌, ఒప్పో కె 3, షావోమి రెడ్మి కె 20 వంటి వాటికీ పోటీగా నిలచే విధంగా దీని స్పెక్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆఫ్‌లైన్ రిటైల్ విస్తరణను పెంచడానికి, హువావే మైక్రోమాక్స్‌తో భాగస్వామ్యాన్నికూడా ప్రకటించింది.  ఈప్రకటన తరువాత ఇది మొదటి అతిపెద్ద ప్రయోగంగా నిలిచింది. ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగంలో కొన్ని చిన్న మార్పులతో పరిచయం చేయబడిన హువావే పి స్మార్ట్ జెడ్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ .20,000 లోపు ఉంటుంది.

స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే, ఈ వై 9 ప్రైమ్ (2019) ఒక 6.59 అంగుళాల Full HD + డిస్ప్లేను కలిగి ఉంటుందని హువావే ధృవీకరించింది మరియు ఇది ఎల్‌సిడి ప్యానెల్ తో ఉంటుంది.  దీని స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి కూడా 91 శాతం ఉంటుంది. కొత్త ట్రెండ్ అయిన పాప్-అప్ కెమెరాని ఇందులో అందించింది. కాబట్టి, పూర్తి వ్యూ  డిస్ప్లే ఇందులో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు కిరిన్ 710 చిప్‌సెట్ శక్తినివ్వనుంది, ఇది 4 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్‌తో జతచేయబడుతుంది. అయితే, ప్రస్తుతానికి 6 జీబీ ర్యామ్ వేరియంట్ ని గురించిన సమాచారం లేదు. ఈ 4 జీబీ ర్యామ్ వేరియంట్ ధర 15,000 పరిధిలో ఉంటుంది, ఇది రియల్మీ ఎక్స్ కి నేరుగా పోటీగా నిలుస్తుంది.

హువావే యొక్కఈ  కొత్త ఫోన్ మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లకు పెద్ద సవాలుగా ఉంటుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, మరొకటి 2 మెగాపిక్సెల్స్ డెప్త్ కెమెరా మరియు మూడవ కెమెరా అల్ట్రా-వైడ్ యాంగిల్ సెన్సార్ కావచ్చు. అలాగే, సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించే అవకాశం ఉంది. కెమెరా అనుభవాన్ని మెరుగుపరచడానికి AI కూడా చేర్చబడుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo