క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 చిప్సెట్ తో HTC U12 + స్మార్ట్ఫోన్ ని మే 23 న ప్రారంభించవచ్చు…..

Updated on 08-May-2018

 

హెచ్టిసి  తన దాని తదుపరి ఫ్లాగ్షిప్ డివైస్ యూ U12+ ని  ప్రారంభించబోతుంది .ఇంటర్నెట్లో చాలాకాలం నుంచి దీని గురించి  చాలా చర్చలు జరిగాయి,ఈ డివైస్  ఒక 5.99 అంగుళాల క్వాడ్ HD + డిస్ప్లేతో  పిక్సెల్ రిజల్యూషన్ 2880×1440  ఉంటుంది. 18:9 యాస్పెక్ట్ రేషియో తో డిస్ప్లే తో ఉంటుంది. 

క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 మొబైల్ ప్లాట్ఫారమ్ తో  ఫోన్ ప్రారంభించబడుతుంది, దీనికి అదనంగా 6GB RAM తో 256GB అంతర్గత స్టోరేజ్ తో  ఉంటుంది. ఫోన్ కి  16 + 12 మెగాపిక్సెల్ కెమెరా కాంబో లభిస్తుంది. ఇది కాకుండా, ఇది 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా కలిగి ఉంటుంది.

మీరు ఫోన్ స్టోరేజ్ ని  పెంచాలనుకుంటే, మీరు దాన్ని పెంచవచ్చు, ఈ స్టోరేజ్ ని  పెంచడానికి ప్రత్యేక మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా మీకు ఇవ్వబడింది. దీనితో పాటు, ఈ పరికరం యొక్క తయారీలో కొన్ని వేర్వేరు మెటీరియల్స్  ఉపయోగించబడుతున్నాయని HTC చెబుతోంది. ఈ ఫోన్లో 3,420mAh సామర్థ్యం గల బ్యాటరీ ఉంది.

 

 

 

 

 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :