OPPO RENO 10X Zoom ఫోన్ను రూ. 10,000 డిస్కౌంట్ ధరకు ఎలా కొనవచ్చునో తెలుసా ?

OPPO RENO 10X Zoom ఫోన్ను రూ. 10,000 డిస్కౌంట్ ధరకు ఎలా కొనవచ్చునో తెలుసా ?

ఇటీవలే, ఒప్పో గొప్ప కెమేరా మరియు స్పీడ్ ప్రాసెసర్ తో  తన Reno 10X జూమ్ స్మార్ట్ ఫోన్ను ఇండియాలో విడుదల చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ను అన్ని విభాగాల్లోనూ చాలా పటిష్టమైన ప్రత్యేకతలతో అందించింది. అంతేకాదు, ఇంకా ఎన్నో ట్రెండీ ఫీచర్లను ఈ స్మార్ట్ ఫోనులో అందించింది. అయితే, ఈ ఫోన్ను కొనడానికి చూస్తున్న వారికీ గొప్ప శుభవార్త. ఎందుకంటే, flipakrt ప్రకటించిన మొబైల్స్ బొనాంజా సేల్ ద్వారా ఈ ఫోన్ను గరిష్టంగా 10,000 రుపాయల తక్కువధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని మీకు అందిస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వాస్తవానికి, ఈ ఫోన్ను ప్రస్తుతం రూ.36,990 రుపాయల ధరతో అమ్ముతుండగా, ఈ సేల్ ద్వారా ఈ ఫోన్ను కేవలం రూ.26,990 రుపాయల ధరకే మీ సొంతం చేసుకునే సువర్ణావకాశం అందిస్తుంది. ఈ సేల్ నుండి ఈ ఫోన్ను కొనేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది మరియు ఇది లిమిటెడ్ పిరియడ్ అఫర్.    ఈ సేల్ ఫిబ్రవరి 17 తేదికి మొదలయ్యి ఫిబ్రవరి 21 వతేదికి ముగుస్తుంది. 

అయితే, ఈ ఫోన్ను ఈ డిస్కౌంట్ ధరకు కొనడానికి మీకు కొన్ని షరతులు కూడా పెట్టింది. అదేమిటంటే, ఈ ఫోన్ను కేవలం ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్ ద్వారా కొనేవారికి మాత్రమే ఈ అఫర్ వర్తిస్తుంది. అంటే, ఈ ఫోన్ కోసం మీరు ముందుగా పూర్తి డబ్బును చెల్లించాల్సి వస్తుంది. అలాగే, ఇది అన్ని డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల EMI పైన కూడా ఈ అఫర్ వర్తింప సుహాసినట్లు చెబుతోంది. కానీ, ఈ ఫోన్ను కొనేముందుగా మీరు ఒకసారి ఈ అఫర్ మీకు వర్తిస్తుందో లేదో అనిన్ చెక్ చేసుకొని కొనడం మంచింది. అలాగే, ఇది ఒక యూజర్ కి ఒకసారి మాత్రమే వర్తిస్తుంది.                                 

ఒప్పో రెనో 10X జూమ్ : ప్రత్యేకతలు

OPPO రెనో 10X జూమ్ HDR 10+ కంటెంట్ మద్దతు మరియు 93.1 శాతం బాడీ టూ స్క్రీన్ రేషియాతో కాస్తుంది. ఇందులో ఒక పెద్ద 6.6 అంగుళాల AMOLED డిస్ప్లేని అందించారు. ఈ ఫోన్ ముందు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 తో భద్రపరచబడింది. ఇది శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్  శక్తితో 6GB / 128GB మరియు 8GB / 256GB వేరియంట్స్ మరియు ఓషియన్ గ్రీన్ మరియు జెట్ బ్లాక్ వాటి రంగుఎంపికలతో కొనుగోలు చేయవచ్చు.

కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక F / 1.7 ఎపర్చరు గల ఒక 48 మెగాపిక్సెల్స్ ప్రధాన సెన్సార్ ఉంది, ఇది ఒక సోనీ IMX586 సెన్సారుతో పాటుగా ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పుతో ఉంది మరియు మొరొక 8-మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు మూడవ 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్లను కలిగిఉంది. ఈ కెమెరా సంస్థ యొక్క 10X హైబ్రిడ్ జూమ్ టెక్నాలజీతో లోడ్ చేయబడింది మరియు ఇది OIS, అల్ట్రా నైట్ మోడ్ 2.0 వంటి లక్షణాలు కలిగి ఉంది. ఈ ఫోన్  ముందు ఒక 16MP సెల్ఫీ కెమేరాని ఒక సరి కొత్త రూపంతో అందించింది.

దీని కెమేరాతో అద్భుతాలను చెయ్యొచ్చు. ఇది పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ద్వారా అందించబడింది కాబట్టి 10X అంటే 10 రేట్ల వరకు జూమ్ చేసుకునే అవకాశాన్నిఇస్తుంది. వివరంగా పరిశీలిస్తే, మీకు చాల దూరంలోవున్న వాటిని కూడా జూమ్ చేసి అతిదగ్గరగా ఫోటోలను తీసుకోవచ్చు.    

ఇక బ్యాటరీ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ 4065mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ హైపర్ బూస్ట్ 2.0 ను కలిగి ఉంది, ఇది గేమ్స్, ఆప్స్  మరియు పెరఫార్మెన్స్ ని ప్రోత్సహిస్తుంది. ఇందులో, OS గురించి చూస్తే,ఇది కలర్ OS 6.0 తో పనిచేస్తుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo