హానర్ Holly 4 Plus 13,999 రూ. లో లాంచ్

హానర్  Holly 4 Plus  13,999 రూ. లో లాంచ్

హువావే యొక్క సబ్ బ్రాండ్ హానర్ గురువారం హోలీ 4 ప్లస్ స్మార్ట్ఫోన్ ని  4000 mAh బ్యాటరీ మరియు 8MP ఫ్రంట్ కెమెరాతో రూ. 13,999 ధరలో  విడుదల చేసింది. ఈ డివైస్లు   గ్రే గోల్డ్ అండ్  సిల్వర్ కలర్స్ లో  లభిస్తాయి మరియు నవంబర్ 3 నుండి అన్ని హానర్ పార్టనర్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటాయి.

హోలీ 4 ప్లస్ 8.2mm  స్లిమ్ బాడీ  మరియు మెటల్ ఫినిష్ తో  వస్తుంది. డివైస్  వెనుక ఫింగర్ ప్రింట్  స్కానర్ ఉంది. ఇది 2.5D గ్లాస్ , HD డిస్ప్లే మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 435 ఆక్టో -కోర్ 64 బిట్  ప్రాసెసర్, ఇది EMUI 5.1 లో Android 7.0 పై నడుస్తుంది. ఈ డివైస్  3GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది, ఇది 128GB వరకు విస్తరించబడుతుంది.

లో లైట్  ఫోటో ఫోటోగ్రఫీ కోసం 1.25 మైక్రోమీటర్ సెన్సార్లతో 12MP వెనుక కెమెరా కలిగి ఉంది. దీనితో పాటు, 8MP ఫ్రంట్ కెమెరా బ్యూటీ మోడ్తో ఉంటుంది

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo