Honor Gala Sale : హానర్ 8X పైన రూ. 5,000 డిస్కౌంట్ మరియు హానర్ 7C పైన రూ. 6,500 డిస్కౌంట్ అందుకోండి.
ఈ సేల్ ఏప్రిల్ 8 నుండి 12 వ తేదీ వరకు ఇది అమేజాన్ మరియు Flipkart నుండి జరగనుంది.
హానర్ GALA సేల్ పేరుతొ నిర్వహిస్తున్న ఈ సేల్ ఏప్రిల్ 8 నుండి 12 వ తేదీ వరకు ఇది అమేజాన్ మరియు Flipkart నుండి జరగనుంది. హానర్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల కోసం ఈ రెండు వైబ్సైట్లు కూడా ప్రత్యకంగా ఒక పీజీని కూడా నిర్వహిస్తున్నాయి. ఈ సేల్ కోసం అందించిన ప్రత్యేకమైన పేజీలో, ఈ సేల్ నుండి హానర్ యొక్క సరికొత్త ట్రెండీ స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లను అందిచనున్నట్లు చెబుతున్నాయి.
Surveyఇందులో భాగంగా, వేనుక డ్యూయల్ కెమెరాల సెటప్పు కలిగిన, హానర్ 8X స్మార్ట్ ఫోన్ యొక్క 4GB మరియు 64GB వేరియంట్ కేవలం రూ. 12,999 ధరతో మరియు 6GB మరియు 64GB వేరియంట్ కేవలం రూ. 14,999 ధరతో ఈ సేల్ ద్వారా అందిస్తోంది. అలాగే, ఇటీవల హానర్ నుండి విడుదలైన స్మార్ట్ ఫోన్ అయినటువంటి, హానర్ 10 లైట్ యొక్క 3GB మరియు 32GB వేరియంట్ రూ.13,999 ధరతో విడుదలవ్వగా, ఈ సేల్ ద్వారా కేవలం రూ.11,999 ధరతో అందిస్తోంది.
అలాగే, హానర్ 7C యొక్క 3GB మరియు 32GB వేరియంట్ రూ.12,999 ధరతో విడుదలవ్వగా, ఈ సేల్ ద్వారా కేవలం రూ. 7,499 ధరతో అందిస్తోంది. ఇక ఈ సేల్ నుండి ఎంచుకున్న స్మార్ట్ ఫోన్ వేరియంట్ ని బట్టి 3 నెలల నుండు 6 నెలల వరకు No Cost EMIని కూడా అందిస్తోంది. కాబట్టి, ఎటువంటి వడ్డీ చెల్లించాల్సినటువంటి, సులభవాయిదాలలో ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఒక 6,500 రుపాయల చాల గొప్ప డిస్కౌంట్ ఈ స్మార్ట్ ఫోను పైన అందిస్తోంది.
ఇంకా హానర్ 8C యొక్క 4GB మరియు 64GB వేరియంట్ రూ.12,999 ధరతో విడుదలవ్వగా, ఈ సేల్ ద్వారా కేవలం రూ. 8,999 ధరతో అందిస్తోంది. దీనిపైన, 4,000 రూపాయల డిస్కౌంట్ అందిస్తోంది.