హానర్ 9X రేపు ఇండియాలో విడుదలకానుంది

Updated on 13-Jan-2020
HIGHLIGHTS

ఒక 16MP పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో విడుదల చేయనున్నట్లు టీజ్ చేస్తోంది.

హానర్ 8X యొక్క తరువాతి తరం స్మార్ట్ ఫోనుగా, హానర్ తన 9 X ను ఇండియాలో రేపు అనగా, 14 జనవరి 2020 న విడుదల చెయ్యడానికి తేదీని ఖరారు చేసింది. Flipkart యొక్క ఆన్లైన్ ప్లాట్ఫారం పైన ఈ ఫోను కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజీని కూడా అందించింది మరియు దీని టీజింగ్ ను కూడా చూపిస్తోంది. ఈ ఫోన్ను ఒక 48MP ట్రిపుల్ రియర్ కెమేరా మరియు ఒక 16MP పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో విడుదల చేయనున్నట్లు టీజ్ చేస్తోంది.  

ముందునుండే, హానర్ తన హానర్ 9 ఎక్స్ యొక్క రెండు వేరియంట్లను ఇతర దేశాలలో విక్రయిస్తోంది. అందులో, ఒకటి చైనా మార్కెట్ కోసం మరియు మరొకటి ప్రపంచ మార్కెట్ కోసం అమ్మడు చేస్తోంది. ఇందులో, చైనీస్ వేరియంట్ కిరిన్ 810 చిప్‌ సెట్‌ తో పనిచేస్తుండగా గ్లోబల్ వేరియంట్‌ లో కిరిన్ 710 F ను అమర్చారు. భారతదేశంలో ఏ వేరియంట్ లాంచ్ అవుతుందో ఇంకా తెలియరాలేదు. అయితే, ఈ సంస్థ భారతదేశంలో మాత్రమే గ్లోబల్ వేరియంట్లను అందించే అవకాశం ఉంది.

చైనాలో లభించే హానర్ 9 ఎక్స్ స్మార్ట్‌ ఫోన్‌ లో, ఒక 6.59-అంగుళాల ఫుల్-HD + (1080×2340 పిక్సెల్స్) డిస్ప్లేతో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ Android 9Pie  ఆధారిత EMUI 9.1.1 లో నడుస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ లో 6 జిబి వరకు ర్యామ్ ఉన్న హిసిలికాన్ కిరిన్ 810 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇన్‌ బిల్ట్ స్టోరేజ్‌ లో మీకు 64 జీబీ, 128 జీబీ ఇచ్చారు, వీటిని మైక్రో ఎస్‌డీ కార్డ్ ఉపయోగించి 512 జీబీ వరకు పెంచవచ్చు.

ఇక ఆప్టిక్స్ పరంగా, ఈ ఫోనులో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటే, ఒకటి f / 1.8 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వబడింది. అలాగే, డెప్త్ సెన్సార్ 2 మెగాపిక్సెల్స్ మరియు 8MP వైడ్ యాంగిల్ కెమేరా కూడా ఉంటుంది. అదే సమయంలో, సెల్ఫీ కెమెరా కోసం f / 2.2 ఎపర్చరుతో 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఇవ్వబడింది మరియు ఒక 4,000 mAh బ్యాటరీతో. కనెక్టివిటీ ఫీచర్లలో వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ 5, 3.5 mm ఆడియో జాక్ మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.   

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :