హానర్ 30V 5G సపోర్టుతో నవంబరులో లాంచ్ కానుంది

HIGHLIGHTS

ఈ ఫోన్ యువ తరాన్ని మరింత ఆకర్షించగలదని చెబుతున్నారు.

ఇటీవల, హానర్ త్వరలో తీసుకురానున్న తన హానర్ వి 30 ప్రో 5 జి మొబైల్ ఫోన్ యొక్క కొత్త అప్డేట్ ను ప్రకటించింది. ఒక 5 జి కనెక్టివిటీతో ఉన్న హానర్ వి 30 ప్రో వచ్చే నెలలో అంటే నవంబర్‌లో లాంచ్ అవుతుందని, సంస్థ యొక్క ప్రెసిడెంట్ జావో మింగ్ వెల్లడించారు. అయితే, అధికారికంగా ఏ లాంచ్ డేట్ ని మాత్రం  ప్రకటించలేదు.

హానర్ ప్రెసిడెంట్ జావో మింగ్ ప్రకారం, త్వరలో రానున్న ఈ  హానర్ స్మార్ట్ ఫోన్ స్టాండ్ అలోన్ మరియు నాన్-స్టాండ్ అలోన్ మోడళ్లతో రావచ్చు. ఈ ఫోన్ యువ తరాన్ని మరింత ఆకర్షించగలదని చెబుతున్నారు.

కొన్నిరూమర్స్ ప్రకారం, ఈ హానర్ వి 30 ప్రో 5 జి మోడల్ లైనప్‌లో భాగంగా ఉంటుంది. ఇది సంస్థ యొక్క కిరిన్ 990 5 జి చిప్‌ సెట్‌ను ఈ ఫోన్‌లో ఉపయోగించవచ్చు. దీనితో పాటు, ఆప్టిక్స్ పరంగా, ఫోన్‌కు ఒక 60MP వెనుక కెమెరా మరియు OLED స్క్రీన్ ఇవ్వవచ్చు. అలాగే, ఈ ఫోన్ ముందు భాగంలో డ్యూయల్ పంచ్ హోల్స్ కూడా ఇవ్వవచ్చు.

కిరిన్ 990 యొక్క 4 జి వెర్షన్‌ను హానర్ వి 30 మోడల్‌లో ఉపయోగించవచ్చు. సింగిల్ పంచ్ హోల్‌తో ఎల్‌సిడి స్క్రీన్ కూడా. దాని వనిల్లా మోడల్‌లో 22.5W  మరియు 40W వైర్డు మరియు 15W వైర్‌లెస్‌ను ప్రో వేరియంట్‌లో ఉపయోగించవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :