లాంచ్ కన్నా ముందగానే హానర్ 30 ప్రో యొక్క స్పెక్స్ లీక్

లాంచ్ కన్నా ముందగానే హానర్ 30 ప్రో యొక్క స్పెక్స్ లీక్
HIGHLIGHTS

ఈ మొబైల్ ఫోన్ యొక్క పూర్తి స్పెక్స్ మరియు ఫీచర్లు మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చాయి.

హువావే యొక్క సబ్ బ్రాండ్ అయినటువంటి హానర్, తన Honor 30 మరియు Honor 30 Pro మొబైల్ ఫోన్లను ఏప్రిల్ 15 న విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తోంది. అయితే, ఇది కాకుండా, ఇటీవల చైనాలోని బ్లూటూత్ SIG మరియు 3C సర్టిఫికేషన్ సైట్లలో హానర్ మొబైల్ ఫోన్ కనిపించిందని, ఈ మొబైల్ ఫోన్ గీక్బెంచ్లో కూడా కనిపించింది. ఇప్పుడు ఆన్‌ లైన్ వార్తల ప్రకారం, TENAA లో హానర్ 30 ప్రో మొబైల్ ఫోన్ కనిపించిందని వెల్లడించారు. అయితే, ఈ జాబితాలో ఎటువంటి హానర్ ఫోన్ యొక్క చిత్రాలు లేవు. కానీ ఈ మొబైల్ ఫోన్ యొక్క పూర్తి స్పెక్స్ మరియు ఫీచర్లు మాత్రం ఖచ్చితంగా బయటకు వచ్చాయి.

ఈ హానర్ 30 ప్రో స్మార్ట్‌ ఫోన్ గురించి మాట్లాడుతూ, ఈ మొబైల్ ఫోనులో మీరు ఒక 6.57-అంగుళాల OLED డిస్ప్లేను పొందవచ్చని, ఇది FHD + రిజల్యూషనుతో కూడిన స్క్రీన్ అవుతుందని చెబుతోంది. మీకు ఫోనులో హువావే కిరిన్ 990 5 జి ప్రాసెసర్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్‌ ఫోనులో అండర్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ను కూడా అందిస్తోంది. ప్రస్తుతానికి, ఈ వార్తలను నమ్మినట్లయితే, ఈ ఫోన్ ఒక కర్వ్డ్ OLED ప్యానెల్ కానుందని కూడా తెలుస్తోంది.

ఇది కాకుండా, మీరు ఈ మొబైల్ ఫోన్‌ లో ఐదు కెమెరాలను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.అలాగే, ఈ మొబైల్ ఫోన్‌ లో ఒక 32 ఎంపి ఫ్రంట్ కెమెరా సెన్సార్ లభిస్తుంది. హానర్ 30 ప్రో లో మీరు క్వాడ్-కెమెరా సెటప్ పొందబోతున్నారు, ఈ మొబైల్ ఫోన్‌ లో మీరు 50 MP  సెన్సార్‌ ను పొందబోతున్నారు. అంటే, ఈ ఫోన్‌ లో Sony IMX700 సెన్సార్‌  ని ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఇది కాకుండా, ఇది 12 MP అల్ట్రా-వైడ్ కెమెరా, 8 MP  టెలి ఫోటో లెన్స్‌తో పాటు, 3 X ఆప్టికల్ జూమ్‌ తో రావచ్చు.

ఈ ఫోన్‌, ఆండ్రాయిడ్ 10 కి సపోర్ట్ ఇచ్చేదిగా ఉంటుంది. ఈ హానర్ 30 ప్రో లో రెండు వేర్వేరు వేరియంట్‌ లను కూడా పొందబోతున్నారని తెలుస్తోంది. ఇందులో,  8 జీబీ / 12 జీబీ ర్యామ్, వీటితో పాటు ఫోన్‌ లో 128 జీబీ స్టోరేజ్‌తో పాటు 256 జీబీ స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఈ జాబితాలో మీకు ఫోన్‌ లో మైక్రో ఎస్‌డి కార్డ్ మద్దతు కూడా లభిస్తుంది. హానర్ 30 ప్రో మొబైల్ ఫోనులో, ఒక  3900 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ చూడవచ్చు. ఈ ఫోన్‌ లో మీరు ముందు భాగంలో పెద్ద స్క్రీన్ మరియు పిల్ ఆకారంలో కటౌట్ పొందబోతుట్లు కూడా తెలుస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo