రియల్మీ X2 గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

HIGHLIGHTS

Realme X2 గొప్ప ప్రత్యేకతలతో వచ్చిన స్మార్ట్ ఫోనుగా అందరి మన్ననలను అందుకుంది.

రియల్మీ X2 గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

రియల్మీ సంస్థ, బడ్జెట్ మరియు మిడ్ రేంజ్ వినియోగదారులను టార్గెట్ చేసుకొని ఇండియాలో తన స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. అలాగే, మరిన్ని కొత్త ఫోన్లను తీసుకురావడానికి చూస్తోంది. అయితే, ఇప్పటి వరకూ 20,000 రుపాయల ధరలో తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్లన్నింటిలో, రియల్మీ X2 కేవలం రూ.16,999 రూపాయల ధరలో గొప్ప ప్రత్యేకతలతో వచ్చిన స్మార్ట్ ఫోనుగా అందరి మన్ననలను అందుకుంది. ఈ ఫోన్ గురించి చూస్తే, కెమేరా, స్పీడ్, ప్రాసెసర్, ఛార్జింగ్ మరియు డిస్ప్లే వంటి అన్ని విషయాలతో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. కాబట్టి, ఈ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి.                         

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Realme X2 : ధరలు

1. Realme X2  (4GB + 64GB) ధర – Rs.16,999

2. Realme X2 (6GB + 128GB) ధర – Rs.18,999

3. Realme X2 (8GB + 128GB) ధర – Rs.19,999

ఈ 20,రూపాయల ధర పరిధిలో చూస్తే, మీకు మార్కెట్లో మీకు చాలా ఎంపికలు ఉన్నాయనే చెప్పొచ్చు. వీటిలో ముఖ్యంగా, లేటెస్ట్ గా వచ్చిన వాటిలో రెడ్మి K20, రియల్మీ XT, పోకో F1 మరియు రెడ్మి నోట్ 8 ప్రో వంటి ఫోన్లు దీనికి పోటీగా వస్తాయి. అయితే, దీని ఓవరాల్ పర్ఫార్మెన్స్, ధరలు మరియు స్పెక్స్ పరంగా ఇది టాప్ ప్లేస్ లో నిలుస్తుంది.               

2. డిస్ప్లే

Realme X2 స్మార్ట్ ఫోన్ ఒక మిడ్-రేంజ్ హ్యాండ్‌సెట్ గా ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. దీని డిస్ప్లే పరంగా గొప్పగా ఉంటుంది. ఇందులో మీకు ఒక 6.4 అంగుళాల డిస్ప్లే ఒక చిన్న డ్యూ డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఈ డిస్ప్లే మీకు 91.9% స్క్రీన్ తో అందుతుంది మరియు ఈ స్క్రీన్ మీకు Super AMOLED తో అందుతుంది. అంటే, ఈ ఫోన్ యొక్క స్క్రీన్ పైన మీకు చాలా రిచ్, షార్ప్ మరియు క్రిప్సీ డీటెయిల్స్ చూసే అవకాశం వుంటుంది మరియు పూర్తి కంటెంట్ FHD(2340×1080) లో చూసే వీలుంటుంది. ఇక రక్షణ పరంగా చూస్తే, ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది కాబట్టి ఇది గట్టిగా వుంటుంది.

3. ప్రాసెసర్                   

 రియల్మీ X2 యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా 2.2 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G SoC యొక్క శక్తితో  వస్తుంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెసర్ కాబట్టి, ఈ స్మార్ట్ ఫోన్ చాలా వేగంగా మరియు స్మూత్ గా పనిచేస్తుంది. ఇది కనెక్టింగ్ పరంగా, స్నాప్ డ్రాగన్ X15 LTE తోవస్తుంది కనుక ఇది వేగవంతమైన డౌన్ లోడ్ మరియు అప్ లోడ్ స్పీడ్ ని మీకు అందిస్తుంది మరియు ఇది క్వాల్కమ్ Kryo 470CPU ప్రాసెసర్ అయినందున మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది.       

4. AIE GPU & ఛార్జింగ్ : గేమింగ్ ప్రత్యేకం

రియల్మీ X2 స్మార్ట్ ఫోనులో మీకు గేమింగ్ అనుభూతి మరింత ఇష్టంగా మారుతుంది. ఈ ఫోనులో అందించిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G SoC ఒక 618GPU జతగా వస్తుంది. ఈ 618GPU అనేది గ్రాఫిక్స్ నుకు మీకు సినిమా -క్వాలిటీ లో అందిస్తుంది. కాబట్టి, మీరుTrue HDR లో ఎక్కవ క్వాలిటీతో గేమింగ్ ఆస్వాదించవచ్చు.  లాగే, ఒక 4000mAh బ్యాటరీతో మద్దతు ఉన్నఈ హ్యాండ్‌సెట్ టైప్-సి పోర్ట్‌ను కలిగి ఉంది మరియు 30 వాట్స్  VOOC 4.0 ఛార్జింగ్‌ కు మద్దతు ఇస్తుంది. ఈ VOOC ఛార్జింగ్ టెక్నాలజీతో, కేవలం 70 నిమిషాల్లో ఈ హ్యాండ్‌ సెట్ బ్యాటరీని 100 శాతం నింపుతుంది.                                     

5. కెమేరా& సెక్యూరిటీ 

సెక్యూరిటీ పరంగా, ఇది మీకు స్టైల్, సౌకర్యం మరియు స్పీడ్ ని కలగలిపి అందిస్తుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే,  ఇందులో వేగవంతమైన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారు ఇవ్వబడింది. ఈ స్మార్ట్ ఫోన్, వెనుక ఒక ప్రత్యేకమైన 3D గ్లాస్ డిజైన్ కలిగి ఉంది, ఇది పెరల్ గ్రీన్, పెరల్ బ్లూ మరియు పెరల్ వైట్ కలర్ ఎంపికలతో వస్తుంది.

ఇక ఆప్టిక్స్ పరంగా, రియల్మి X2  వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది f / 2.25 ఎపర్చరు లెన్స్ మరియు 119 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో ఒక 8MP  అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్,  దీనికి జతగా (F / 2.4) ఏపర్చర్ 64MP ప్రాధమిక సెన్సార్‌ తో పాటు, 2MP పోర్ట్రెయిట్ లెన్స్ మరియు (f / 2.4) 2MP మ్యాక్రో కెమెరా కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్, మెరుగైన Low -Light చిత్రాలను కూడా అందిస్తుంది. ముందు భాగంలో 32MP సెన్సార్, ఒక f / 2.0 ఎపర్చర్‌ తో ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo