పవర్ ఫుల్ ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్ చేసిన మోటోరోలా. అదే, మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యుజన్ స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ అనేక ప్రీమియం ఫీచర్లను తనలో ఇముడ్చుకుంది. 144Hz రిఫ్రెష్ రేట్ pOLED డిస్ప్లే మొదలుకొని 3D Dolby Atmos వరకూ అనేక ఫీచర్లను ఈ ఫోన్ కలిగివుంది. Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ నుండి మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యుజన్ అందుబాటులోకి రానుంది. అందుకే, లేటెస్ట్ ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన వివరాలను ఇక్కడ అందించాను.
Survey
✅ Thank you for completing the survey!
Motorola Edge 30 Fusion: Price
మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యుజన్ ఫోన్ 8జిబి మరియు 128జిబి స్టోరేజ్ తో రూ.42,999 రూపాయల ధరతో ప్రకటించబడింది. ఈ ఫోన్ సెప్టెంబర్ 22 నుండి సేల్ అవుతుంది మరియు Flipkart బిగ్ బిలియన్ డేస్ నుండి ఈ ఫోన్ రూ.39,999 ధరతో సేల్ అవుతుంది. ఈ సేల్ నుండి మరిన్ని బ్యాంక్ మరియు ఇతర ఆఫర్లను పొందే వీలుంది.
మోటోరోలా ఎడ్జ్ 20 ఫ్యుజన్ 6.55 ఇంచ్ FHD+ రిజల్యూషన్ గల పంచ్ హోల్ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR 10+ సర్టిఫైడ్ pOLED డిస్ప్లే. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 888+ ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు 8జిబి ర్యామ్ జతగా వస్తుంది. ఈ ఫోన్ ఇంటర్ కాస్మిక్ గ్రే మరియు సోలార్ గోల్డ్ అనే రెండు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.
ఆప్టిక్స్ పరంగా, ఎడ్జ్ 20 ఫ్యుజన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగివుంది. ఈ కెమెరా సెటప్ లో OIS సపోర్ట్ కలిగిన 50MP ప్రధాన కెమెరాకి జతగా 13 అల్ట్రా వైడ్ కెమెరా మరియు 2MP డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. ఈ కెమెరాతో అల్ట్రా రిజల్యూషన్ ఫోటోలను మరియు వీడియోలనుచిత్రీకరించ వచ్చని కంపెనీ చెబుతోంది. ఇక ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరాని ఈ ఫోన్ కలిగివుంది మరియు ఈ కెమెరాతో RAW మరియు HDR ఫోటోలను పొందవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యుజన్ లో 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,400 mAh బ్యాటరీని అందించింది. ఇక ఇతర ఫీచర్ల విషయాన్ని వస్తే, ఈ ఫోన్ లో యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ కలిగిన 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వుంది. ఈ ఫోన్ IP52 వాటర్ ప్రొటెక్షన్ సర్టిఫికేషన్ తో వస్తుంది మరియు ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కూడా కలిగివుంది. ఆడియో పరంగా, ఈ ఫోన్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్ సెటప్ ను కలిగి వుంది.