హానర్ బెస్ట్ బడ్జెట్ కెమేరా ఫోన్ Honor 20i పైన భారీ డిస్కౌంట్
ఈ స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు 3,000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది.
ఇటీవల, Huawei యొక్క ఉప బ్రాండ్ అయినా హానర్ దాని కొత్త స్మార్ట్ ఫోన్ అయినటువంటి హానర్ 20i ఇండియాలో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వినియోగదారులను అమితంగా ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, అనేక ఆసక్తికరమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. అయితే, ముందుగా Rs. 14,999 ధరతో లాంచ్ చేసినటువంటి ఈ స్మార్ట్ ఫోన్ పైన ఇప్పుడు 3,000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పుడు, ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.11,999 ధరతో అమేజాన్ ఇండియా నుండి అమ్ముడవుతోంది.
Surveyహానర్ 20i ధర
హానర్ 20i ( 4GB + 128GB ) ధర – Rs. 14,999 (ఇక్కడ నుండి కొనవచ్చు)
హానర్ 20i ప్రత్యేకతలు :
20i లోఅందించిన వాటర్ డ్రాప్ నోచ్, ఒక U- ఆకారంలో చెయ్యబడింది మరియు ఇందులో ఒక సెల్ఫీ కెమేరాని కలిగి ఉంది, ఇది ఒక 6.21 అంగుళాల IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫుల్ HD + రిజల్యూషనుతో వస్తుంది మరియు 19.5: 9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే, ఇది 90 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తుంది. ఈ ఫోను యొక్క ముందుభాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా f / 2.0 ఎపర్చరుతో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ మల్టిఫుల్ ఫేస్ బఫరింగ్ ఫిచరును అందిస్తుంది. దీనితో పాటు, ఈ స్క్రీన్ ఫ్లాష్ లాగా కూడా మద్దతిస్తుంది.
ఇక రియర్ కెమేరా విషయానికి వస్తే, ఒక ఎపర్చరు F / 1.8 కలిగిన 24 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ మరియు దానికి జతగా రెండవ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా మరియు మూడవ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కలిగి, ఈ 20i వెనుక AI ట్రిపుల్ కెమెరాని కలిగివుంది. ఈ కెమెరా, నైట్ సీన్ మోడ్, యాంటీ షేక్, సూపర్ Slo- మోషన్ వీడియో, ప్రొఫెషనల్ మోడ్, వైడ్ మరియు పోర్ట్రైట్ మోడ్ వంటి అనేక ఎంపికలతో పాటుగా వస్తుంది. ఈ ఫోన్ కిరిణ్ 710 SoC కి జతచేయబడిన 4 GB RAM శక్తితో పనిచేస్తుంది. ఇది 128GB అంతర్గత స్టోరేజి మరియు 512GB వరకు స్టోరేజిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.
ఈ ఫోన్ వెనుక ప్యానెల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ముందు ఫేస్ అన్లాక్ ఫిచరుతో ఉంటుంది . ఈ ఫోన్ Android 9 పై ఆధారంగా EMU 9 తో పనిచేస్తుంది. ఈ పరికరంలో గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి గేమ్ Turbo 2.0 జతచేయబడింది. కనెక్టివిటీ విషయానికి వస్తే, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n / AC, బ్లూటూత్ 4.2, జీపీఎస్, మైక్రోUSB 2.0, GPS మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ అందిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
