GST On Mobile Phones: కొత్త జీఎస్టీ తో మొబైల్ రేట్లు తగ్గనున్నాయా!
అమలులో ఉన్న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST) లో భారీగా మార్పులు చేస్తూ కొత్త ప్రణాళిక ప్రకటించింది
ఇందులో ప్రజలకు ఉపయోగకరమైన చాలా వస్తువులపై టాక్స్ తగ్గించింది
ఈ కొత్త టాక్స్ ప్రకారం మొబైల్ రేట్లు తగ్గనున్నాయా, అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు
GST On Mobile Phones: దేశ ప్రజలకు ప్రభుత్వం చాలా గొప్ప శుభవార్త అందించింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST) లో భారీగా మార్పులు చేస్తూ కొత్త ప్రణాళిక ప్రకటించింది. ఈ కొత్త గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST) సెప్టెంబర్ 22 వ తేదీ అమలు అవుతుంది. ఇందులో ప్రజలకు ఉపయోగకరమైన చాలా వస్తువులపై టాక్స్ తగ్గించింది. అయితే, ఈ కొత్త టాక్స్ స్లాబ్స్ ప్రకారం మొబైల్ రేట్లు తగ్గనున్నాయా? అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, ఈ పండుగ సీజన్ లో కొత్త మొబైల్ కొనాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి సహజంగా ఇదే డౌట్ వస్తుంది.
SurveyGST On Mobile Phones: మొబైల్ రేట్లు తగ్గుతాయా?
ప్రభుత్వం ముందుగా నాలుగు అంచెల 12% మరియు 28% టాక్స్ విధానం అమలు చేసింది. అయితే, ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తూ ఇప్పుడు రెండంచెల 5% మరియు 18% జీఎస్టీ విధానం అమలులోకి తెచ్చింది. అయితే, సిన్ / లగ్జరీ కొత్త స్లాబ్ ను కూడా పరిచయం చేసింది మరియు ఇది గరిష్టంగా 40% టాక్స్ పరిధిలోకి వస్తుంది. కొత్త జీఎస్టీ పరిధిలో చాలా నిత్యావసర వస్తువులతో పాటు స్మార్ట్ టీవీ, ఎయిర్ కండిషన్, డిష్ వాషింగ్ మెషిన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు టాక్స్ తగ్గింపు అందుకున్నాయి. అయితే, ఇందులో మొబైల్ ఫోన్ కోసం ఎటువంటి జీఎస్టీ తగ్గింపు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మాటకు ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే, టాక్స్ పరంగా మొబైల్ ఫోన్స్ రేట్లు తగ్గే అవకాశం ఉండదు. ఎందుకంటే, ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీఎస్టీ స్లాబ్ లో మొబైల్ ఫోన్ టాక్స్ పై ఎటువంటి తగ్గింపు లేదా రాయితీ అందించలేదు. 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన అదే 18% టాక్స్ ఇకముందు కూడా కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. అంటే, భారతదేశంలో మొబైల్ ఫోన్ల పై వర్తించే 18% GST రేటు స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్ ఫోన్లు మరియు టాబ్లెట్ లకు కూడా వర్తిస్తుంది.

అయితే, పండుగ సీజన్ కాబట్టి అమ్మకాల కోసం కంపెనీలు లేదా మార్కెట్ వర్గాలు ఏదైనా ఆఫర్ల ద్వారా రేటు తగ్గిస్తే మాత్రం మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, ఫీచర్స్ ఫోన్ లేదా టాబ్లెట్ రేట్లలో మార్పులు అవకాశం ఉండవచ్చు. అంతేకాని ప్రభుత్వం ప్రకటించిన కొత్త జీఎస్టీ స్లాబ్ ప్రభావం స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీ పై మాత్రం ఉండదు. అయితే, మొబైల్ ఫోన్ ఇండ్రస్టీ కోసం కూడా కొత్త జీఎస్టీ 5% స్లాబ్ తీసుకురావాలని కంపెనీలు మరియు మార్కెట్ ప్రముఖులు ప్రభుత్వానికి విన్నవించినట్టు తెలుస్తోంది.
Also Read: Gemini for Home : ఇక ఇంటి స్మార్ట్ పరికరాల కోసం కూడా జెమినీ వస్తోంది.!