flipkart నుండి శామ్సంగ్ కార్నివాల్ : శామ్సంగ్ A50 పైన భారీ డిస్కౌంట్
ఈ సేల్ రేపటితో ముగియనుంది
శామ్సంగ్ యొక్క A సిరీస్ నుండి ప్రీమియం డిజైనుతో పాటుగా ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన ఒక సూపర్ AMOLED డిస్ప్లే తో వచ్చింది. అంతేకాదు ఈ ఫోన్ వెనుక మూడు కెమేరాలతో కూడా ఉంటుంది. ముందుగా, ఈ స్మార్ట్ ఫోన్ రూ.18,990 రూపాయల ధరతో ఇండియాలో లాంచ్ చేయబడింది. అయితే, ప్రస్తుతం Flipakrt ప్రకటించిన "శామ్సంగ్ కార్నివాల్ సేల్" నుండి ఈ ఫోన్ కేవలం రూ.14,999 రూపాయల ధరకే లభిస్తుంది. అధనంగా ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో ఈ ఫోన్ను కొనేవారికి 5% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది మరియు No Cost EMI కూడా అందుబాటులోవుంది. ఈ సేల్ రేపటితో ముగియనుంది కాబట్టి కొనదలచిన వారు త్వరపడవచ్చు.
Galaxy A50 డిస్కౌంట్ ధర
ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 ( 4GB ర్యామ్ + 64 స్టోరేజి ) వేరియంట్ Rs.18,490 ధరతో ఉండగా, ప్రస్తుతం ఈ సేల్ నుండి కేవలం రూ.14,999 రూపాయల ధరకే లభిస్తుంది. మరొక వేరియంట్ అయినటువంటి, శామ్సంగ్ గెలాక్సీ A50 ( 6GB ర్యామ్ + 64 స్టోరేజి ) వేరియంట్ కేవలం రూ.17,999 రూపాయల ధరకు అమ్మాయుడవుతోంది. వాస్తవానికి, ఈ వేరియంట్ ముందుగా Rs. 21,490 ధరతో అమ్ముడయ్యింది.
శామ్సంగ్ గెలాక్సీ A50
గెలాక్సీ A సిరీస్ నుండి వచ్చిన ఫోన్లలో, ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ ప్రీమియం డిజైనుతో ఉంటుంది. ఈ ఫోన్ ఒక 6.4 అంగుళాల FHD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. అధనంగా, ఇది ఒక 91.6 %స్క్రీన్- టూ- బాడీ రేషియోతో వస్తుంది. ఇది వేనుక భాగంలో ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును కలిగి ఉంటుంది. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా, ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ జతగా 25MP ప్రధాన కెమరాతో జతగా మరొక 5MP డెప్త్ కెమేరాని కలిగి ఉంటుంది. ఈ కెమేరా, శామ్సంగ్ యొక్క ఇంటెలిజెంట్ సీన్ ఆప్టిమైజర్ ని ఉపయోగించి, కాంట్రాస్ట్, బ్రైట్ మరియు కలర్ ను ఆప్టిమైజ్ చేస్తుంది.
ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ ఒక Exynos 9610 ఆక్టా – కోర్ ప్రాసెసర్ మరియు జతగా 6GB ర్యామ్ శక్తితో నడుస్తుంది. ఈ ఫోన్ ఒక ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అందించబడింది. ఇది ఒక 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయగల ఒక 4,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్, బ్లూ, బ్లాక్ మరియు వైట్ వంటి మూడు కలర్ల ఎంపికతో లభిస్తుంది. ఇది, 4GB మరియు 6GB ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది.