Google Pixel 8 now available with 29k big discount on flipkart
Google Pixel 8 స్మార్ట్ ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. సూపర్ చిప్ సెట్ మరియు కెమెరాతో వచ్చిన ఈ గూగుల్ ఫోన్ ను ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరకు అందుకునే అవకాశం వుంది. ఈ గూగుల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ కారణంగా కొనుగోలు చేయలేక పోయిన వారు ఈరోజు ఈ ఫోన్ పై అందించిన డీల్స్ ను పరిశీలించవచ్చు.
గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 75,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ 26,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకొని రూ. 49,999 ఆఫర్ ధరకు లభిస్తోంది. అదనంగా, ఈ ఫోన్ ను HDFC క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే యూజర్లు రూ. 3,000 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
అంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి ఈ ఫోన్ ను రూ. 46,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ ఫోన్ పై అదనపు ఎక్స్ బోనస్ ఆఫర్ ను కూడా ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది.
Also Read: Realme P3 Series: ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!
ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ గూగుల్ సొంత చిప్ సెట్ Tensor G3 తో పని చేస్తుంది మరియు దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కలిగిన 6.2 ఇంచ్ OLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 24 Bit ప్యానల్ మరియు HDR పై కూడా 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ 50MP + 12MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 10.5 MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లోని రెండు కెమెరాలు కూడా 24 fps లేదా 30 fps లేదా 60 fps వద్ద కూడా 4K UHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ Magic Editor తో సహా గూగుల్ యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ మరియు ఫిల్టర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.