Google Pixel 8: ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 29 వేల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.. ఎక్కడంటే.!
Google Pixel 8 స్మార్ట్ ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది
గూగుల్ ఫోన్ ను ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరకు అందుకునే అవకాశం
ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ గూగుల్ సొంత చిప్ సెట్ Tensor G3 తో పని చేస్తుంది
Google Pixel 8 స్మార్ట్ ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సేల్ అవుతోంది. సూపర్ చిప్ సెట్ మరియు కెమెరాతో వచ్చిన ఈ గూగుల్ ఫోన్ ను ఈరోజు ఎన్నడూ చూడనంత చవక ధరకు అందుకునే అవకాశం వుంది. ఈ గూగుల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ కారణంగా కొనుగోలు చేయలేక పోయిన వారు ఈరోజు ఈ ఫోన్ పై అందించిన డీల్స్ ను పరిశీలించవచ్చు.
SurveyGoogle Pixel 8 ఆఫర్స్ ఏమిటి?
గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 75,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ 26,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకొని రూ. 49,999 ఆఫర్ ధరకు లభిస్తోంది. అదనంగా, ఈ ఫోన్ ను HDFC క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే యూజర్లు రూ. 3,000 అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
అంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి ఈ ఫోన్ ను రూ. 46,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. ఈ ఫోన్ పై అదనపు ఎక్స్ బోనస్ ఆఫర్ ను కూడా ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది.
Also Read: Realme P3 Series: ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ చేస్తున్న రియల్ మీ.!
Google Pixel 8 : ఫీచర్స్
ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ గూగుల్ సొంత చిప్ సెట్ Tensor G3 తో పని చేస్తుంది మరియు దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కలిగిన 6.2 ఇంచ్ OLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 24 Bit ప్యానల్ మరియు HDR పై కూడా 1400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందిస్తుంది మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.

గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ 50MP + 12MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 10.5 MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లోని రెండు కెమెరాలు కూడా 24 fps లేదా 30 fps లేదా 60 fps వద్ద కూడా 4K UHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ ఫోన్ Magic Editor తో సహా గూగుల్ యొక్క ప్రత్యేకమైన కెమెరా ఫీచర్స్ మరియు ఫిల్టర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile