Google Pixel 4a స్మార్ట్ ఫోన్ Pixel 3a సిరీస్ లైనప్ ఫోన్స్ వారసుడిగా అధికారికంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టబడింది. ఈ పిక్సెల్ 4 ఎ ఫ్లాగ్ షిప్-లెవల్ కెమెరాతో వనిల్లా పిక్సెల్ అనుభవాన్ని అందించే విధంగా తీసుకురాబడింది. అంతేకాదు, ఇప్పటికే మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో Oneplus Nord మరియు ఆపిల్ ఐఫోన్ SE 2020 వంటి వాటికి గట్టి పోటీనిచ్చే స్మార్ట్ ఫోనుగా కనిపిస్తోంది. ఈ Pixel 4a, గత సంవత్సరం గూగుల్ పిక్సెల్ 4 ను విడుదల చేయని దేశాలను కూడా లక్ష్యంగా చేసుకొని లాంచ్ చెయ్యబడింది, ఇందులో భారతదేశం కూడా వుంది. అయితే, ప్రాంతాలను బట్టి ఈ స్మార్ట్ ఫోన్ లభ్యత మారుతూ ఉంటుంది.
COVID-19 వ్యాప్తి చెందడం వల్ల, పిక్సెల్ 4 ఎ విడుదల కొంచెం ఆలస్యంగా జరిగిందని గూగుల్ సూచించింది. ముఖ్యంగా, ఈ స్మార్ట్ ఫోన్ తయారీకి కావాల్సిన ముడి సరుకు సరఫరా పైన ప్రభావం చూపడం, ఈ ఆలస్యానికి కారణమయ్యింది. అందువల్ల, కొన్ని దేశాలలో ఈ పిక్సెల్ 4 ఎ యొక్క లభ్యతలో ఆలస్యాన్ని చూడవచ్చు.
Pixel 4a యొక్క ఫీచర్లు , ధర మరియు లభ్యత గురించి క్లుప్తంగా చూద్దాం.
గూగుల్ పిక్సెల్ 4 ఎ 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి స్టోరేజ్ తో వస్తుంది మరియు దీని ధర $ 349 గా ప్రకటించింది. ఇది ఆగస్టు 20 నుండి ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్, తైవాన్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌లో లభిస్తుంది. పిక్సెల్ 4 ఎ అక్టోబర్ నెలలో భారతదేశంలో లభిస్తుంది. అలాగే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఇండియన్ ప్రైస్ కూడా అమ్మకం తేదీ సమయానికి ప్రకటించవచ్చు.
70 శాతం రీసైకిలింగ్ చెయ్యగల పదార్థంతో తయారు చేసిన ఫాబ్రిక్ డిజైన్ తో,ఈ పిక్సెల్ 4 ఎ కోసం గూగుల్ కొన్ని కొత్త కేసులను తయారు చేసింది మరియు ప్రాథమికంగా బ్లాక్, స్టాటిక్ గ్రే మరియు బ్లూ కాన్ఫెట్టి రంగులలో ఎంచుకుంటుంది.
గూగుల్ పిక్సెల్ 4 ఎ సాఫ్ట్-టు-టచ్ ప్లాస్టిక్ బ్యా క్‌తో కొత్త డిజైన్ ను కలిగి ఉంది. కాని, Pixel 3a లో ఉన్నట్లుగా డ్యూయల్ టోన్ స్టైల్ మాత్రం ఇవ్వలేదు. ఇది 8.2 మిల్లీమీటర్ల మందంతో మరియు పాలికార్బోనేట్ తో నిర్మించడం వలన ఇది చాలా తేలికగా వుంటుంది, ఇది 143 గ్రాముల బరువు ఉంటుంది. స్పీడ్ అన్ లాక్ తో ఫోన్ మధ్యలో వేలిముద్ర రీడర్ ఉంది. ఈ ఫోన్ యొక్క ధరను దృష్టిలో ఉంచుకొని ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వలేదు.
Pixel 4a ఒక 5.8-అంగుళాల F HD + (2340 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది OLED ప్యానెల్‌ను ఉపయోగిస్తుంది. ఈ స్క్రీన్ సెల్ఫీ కెమెరాను ఉంచడానికి ఎగువ-ఎడమ మూలలో పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది మరియు అంచులు చాలా తక్కువగా వుండే విధంగా, బెజెల్ లెస్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది 19.5: 9 ఎస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. అదనంగా, ఈ డిస్ప్లే HDR + సర్టిఫైడ్ కాబట్టి, ఇది ఫోన్ లో వీడియో-వీక్షణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది, మరియు స్టీరియో స్పీకర్లతో ఆడియో కూడా మంచిగా వుంటుంది.
పిక్సెల్ 4 ఎ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730 జి యొక్క శక్తితో నడుస్తుంది. ఇది ఆక్టా-కోర్ సిపియు మరియు 2.2GHz మరియు అడ్రినో 618 GPU జతగా వస్తుంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది. పిక్సెల్ ఫోన్ కావడంతో, గూగుల్ ఫోటోలలో అన్లిమిటెడ్ ఫోటో మరియు వీడియో స్టోరేజ్ ను అధిక నాణ్యతతో ఉచితంగా అందిస్తుంది. పిక్సెల్ 4 ఎ అనేది పిక్సెల్ 4 యొక్క కొద్దిగా టోన్-డౌన్ వెర్షన్, ఇది గత సంవత్సరం చివర్లో ప్రారంభమైంది. ఇది Soli radar chip లేదా Pixel Neural Core తో రాదు, కానీ Titan M security chip తో వస్తుంది, ఇది మీ డేటాను మూడు సంవత్సరాల పాటు నమ్మకంగా కొత్త అప్డేట్ లతో పాటు సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
గూగుల్ పిక్సెల్ 4 ఎ, కేవలం సింగిల్ 12 MP కెమెరాతో వస్తుంది, ఇది పిక్సెల్ 4 వలె అదే సోనీ IMX363 సెన్సార్‌ను OIS మరియు EIS లకు మద్దతుగా ఉపయోగిస్తుంది. పిక్సెల్ 4 ఎ యొక్క కెమెరా తన కెమెరా నుండి Live HDR+, నైట్ సైట్, ఆస్ట్రో ఫోటోగ్రఫీ, సూపర్ రెస్ జూమ్ మరియు మరిన్ని ఫీచర్లతో పిక్సెల్ 4 లాంటి చిత్రాలను ఉత్పత్తి చేయగలదని గూగుల్ పేర్కొంది. ఈ ఫోన్ వెనుక కెమెరా 30Kps వద్ద 4K, 3080/30/60fps వద్ద 1080p మరియు 240fps వరకు 720p రికార్డ్ చేయగలదు, సెల్ఫీ కెమెరా పూర్తి HD వీడియోలను 30fps వద్ద షూట్ చేయగలదు. ఈ ఫోన్ లోని ముందు కెమెరా 84 డిగ్రీల ఫీల్డ్-ఆఫ్ వ్యూతో 8 MP కెమెరాతో పిక్సెల్ 3 ఎ వలె ఉంటుంది.
Pixel 4 a, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ తో వస్తుంది మరియు గూగుల్ అసిస్టెంట్‌తో ముందే లోడ్ చేయబడి, కొత్త రికార్డర్ యాప్ వంటి కొత్త ఫీచర్లతో పాటు AI మరియు మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ లను ఉపయోగించి మాటలను టెక్స్ట్ గా మారుస్తుంది. అదనంగా, ఫోన్ లైవ్ ట్రాన్స్క్రిప్ట్ మరియు లైవ్ క్యాప్షన్ వంటి వాటికీ యాక్సెస్ ను కలిగి ఉంది.
పిక్సెల్ 4 ఎ లో 3,140 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వబడింది. ఈ 4a 24 గంటల బ్యాటరీ బ్యాకప్ ను అందించగలదని గూగుల్ పేర్కొంది మరియు మీరు మీ ఫోన్ ను ఎలా ఉపయోగిస్తారనే దాని పైన ఆధారపడి బ్యాటరీ జీవితాన్ని నిర్వహించే అడాప్టివ్ బ్యాటరీ ఫీచర్‌తో వస్తుంది.