Google Pixel 11: పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు AI శక్తితో వచ్చే అవకాశం.!

HIGHLIGHTS

ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో గూగుల్ పిక్చర్ స్మార్ట్ ఫోన్ లకు సుస్థిర స్థానం ఉంది

గూగుల్ త్వరలో అప్ కమింగ్ ఫోన్ ప్రకటించే అవకాశం ఉంది

Google Pixel 11 పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు AI శక్తితో వచ్చే అవకాశం

Google Pixel 11: ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో గూగుల్ పిక్చర్ స్మార్ట్ ఫోన్ లకు సుస్థిర స్థానం ఉంది. ఇప్పటికే గూగుల్ పిక్చర్ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్ తో మార్కెట్ ను ముంచెత్తిన గూగుల్, త్వరలో అప్ కమింగ్ ఫోన్ ప్రకటించే అవకాశం ఉంది. ఆన్లైన్ లో ఇప్పటికే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి అనేక అంచనా స్పెక్స్ మరియు ఫీచర్స్ వెల్లువెత్తాయి. ఈ అంచనాల ప్రకారం పర్ఫార్మెన్స్, AI ఫీచర్ల పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది.

Google Pixel 11: లాంచ్ ఎప్పుడు అవుతుంది?

గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ను 2026 ఆగస్టు నెలలో గ్లోబల్ లాంచ్ చేసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, ఇది కేవలం మార్కెట్ మరియు టెక్ వర్గాలు వేస్తున్న అంచనా మాత్రమే అని గమనించాలి.

ఈ అప్ కమింగ్ సిరీస్ నుంచి గూగుల్ పిక్సెల్ 1ఓ సిరీస్ మాదిరిగా రెగ్యులర్ పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL మరియు పిక్సెల్ ఫోల్డ్ వేరియంట్ వంటి ఫోన్లు లాంచ్ కావచ్చని అంచనా.

Google Pixel 11: అంచనా ఫీచర్స్

గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ లో గూగుల్ కొత్తగా Tensor G6 ప్రాసెసర్ ఉపయోగించే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి. ఇది 2nm టెక్నాలజీ పై నిర్మించిన చిప్ సెట్ మరియు తక్కువ పవర్ వినియోగించి ఎక్కువ వేగంతో పని చేస్తుందని కూడా లీక్స్ చెబుతున్నాయి. ఈ చిప్ సెట్ మెరుగైన పెర్ఫార్మెన్స్ కోసం 7-core CPU తో ఉంటుందని కూడా చెబుతున్నారు. ఇది AI పనులకు ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేయబడిన చిప్ సెట్ అని కూడా హింట్ ఇస్తున్నారు.

అయితే, ఈ చిప్ సెట్ గ్రాఫిక్స్ యూనిట్ GPU పరంగా కొంచెం పాతదిగా ఉండే అవకాశం ఉందని లీక్స్ పేర్కొన్నాయి. అయితే, రోజువారీ ఉపయోగం కోసం ఇది అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుందని లీక్స్ తెలిపాయి. ఈసారి గూగుల్ పిక్సెల్ 11 సిరీస్ ఫోన్ లను పూర్తి AI ఫోన్‌ గా మార్చే ప్రయత్నం చేసే అవకాశం ఉందని కూడా కొన్ని లీక్స్ చెబుతున్నాయి.

Also Read: గ్రేట్ సమ్మర్ సేల్ కంటే ముందే Samsung Smart Tv లపై భారీ డీల్స్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

ఇందులో ఒకేసారి అనేక టాస్క్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి చేయగల కొత్త AI “Agent” సిస్టమ్ ఉంటుందని రూమర్స్ ఉన్నాయి. అంటే, ఇది యూజర్ కోసం పూర్తి స్థాయి స్మార్ట్ అసిస్టెంట్ ఫోన్ గా మారే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ లో కూడా బెస్ట్ కెమెరా సెటప్ ఉంటుంది. ఎప్పటి లాగానే ఈ ఫోన్ లో కూడా పెద్ద హార్డ్‌వేర్ మార్పులకంటే సాఫ్ట్‌వేర్ మరియు AI మెరుగుదలలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

గూగుల్ అప్ కమింగ్ ఫోన్ సిరీస్ గురించి ఇప్పటికే గ్లోబల్ మార్కెట్ లో చర్చ మొదలయ్యింది. ఈ ఫోన్ గురించిన మరిన్ని అప్‌డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.

గమనిక: బ్యానర్ ఇమేజ్ గూగుల్ పిక్సెల్ 11 ఫోన్ కాదని గమనించాలి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :