ఇప్పటికే స్మార్ట్ ఫోన్లలో వున్న ఈ Google ఫీచర్, ఇప్పుడు Jio Phone మరియు Jio Phone 2 తో పాటుగా KaiOS తో పనిచేసే అన్ని ఫీచర్ ఫోన్లకు కూడా అందుతుంది.
ఈ ఫీచర్ కేవలం Google Assistant తో పనిచేసే KaiOS ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.
Reliance Jio టెలికం సంస్థ ఇండియాలో అతితక్కువ ధరలో 4G టెక్నాలజీ మరియు Google Assistant తో తీసుకొచ్చిన Jio Phone మరియు Jio Phone 2 రెండు ఫోన్లు కూడా KaiOS తో పనిచేస్తాయి.
Jio Phone మరియు Jio Phone 2 రెండు కూడా ఇండియాలో అత్యధికంగా వాడకంలో వున్న ఫీచర్ ఫోన్లుగా నిలుస్తాయి. ఇప్పుడు, ఈ ఫీచర్ ఫోన్లకు ఒక కొత్త గూగుల్ ఫీచర్ వచ్చి చేరింది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లలో వున్న ఈ Google ఫీచర్, ఇప్పుడు Jio Phone మరియు Jio Phone 2 తో పాటుగా KaiOS తో పనిచేసే అన్ని ఫీచర్ ఫోన్లకు కూడా అందుతుంది.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటి ఆ Google ఫీచర్ ?
ముందు నుండే, స్మార్ట్ ఫోన్లలో ఉపయోగంలో వున్న గూగుల్ అసిస్టెంట్ ద్వారా Google Lens Support ని KaiOS తో పనిచేసే అన్ని ఫీచర్ ఫోన్లలో సపోర్ట్ చేసే విధంగా గూగుల్ కొత్త అప్డేట్ తెచ్చినట్లు ప్రకటించింది.
గూగుల్ KaiOS ఫోన్లలో కొత్తగా ప్రకటించిన ఈ Google Lens Support తో తర్జుమా సామర్ధ్యాన్ని మీ ఫోనుకు అందిస్తుంది. అంటే, కేవలం మీ ఫోన్ కెమెరాతో మీకు కావాల్సిన పదాలను ఫోటో తీసి ఆ పదాలను సులభంగా ఇన్స్టాంట్ ట్రాన్సలేట్ (తర్జుమా) చేయవచ్చు. అయితే, ఈ ఫీచర్ కేవలం Google Assistant తో పనిచేసే KaiOS ఫోన్లలో మాత్రమే పనిచేస్తుంది.
Jio Phone మరియు Jio Phone 2
చాలా తక్కువ ధరకే అందరికి మంచి ఫీచర్స్ వున్న ఫీచర్ ఫోన్ అందించాలనే సంకల్పంతో Reliance Jio టెలికం సంస్థ ఇండియాలో అతితక్కువ ధరలో 4G టెక్నాలజీ మరియు Google Assistant తో తీసుకొచ్చిన Jio Phone మరియు Jio Phone 2 రెండు ఫోన్లు కూడా KaiOS తో పనిచేస్తాయి. కాబట్టి, ఈ రెండు ఫోన్లు కూడా గూగుల్ కొత్తగా ప్రకటించిన ఈ Google Lens Support ని అందుకుంటాయి.
ఈ Google Lens ఫీచర్ తో ఉపయోగం ఏమిటి?
ఈ గూగుల్ లెన్స్ సపోర్ట్ మీ ఫీచర్ ఫోన్ను స్మార్ట్ ఫోన్ స్థాయికి తీసుకెళుతుంది. ఎందుకంటే, మీరు ఈ ఫీచర్ తో మీ తెలియని పదాలు లేదా భాషాకి సంబంధించిన వాటాని కేవలం ఫోటో తియ్యడంతో మీకు కావాల్సిన భాషల్లో కి తర్జుమా చేసి గూగుల్ అసిస్టెంట్ ద్వారా మీకు చదివి వినిపిస్తుంది.