Xiaomi ఫోన్స్ కొనాలనుకునే వారికీ గుడ్ న్యూస్ : ఈ రోజు నుండి 8 వ తేదీవరకు ఈ ఫోన్ల పైన డిస్కౌంట్

HIGHLIGHTS

పరిమితకాల అఫర్ కాబట్టి ముందుగా ఎంచుకున్నవారు కొనుగోలు చేయవచ్చు.

షావోమి యొక్క కొన్ని స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందిస్తోంది, అమెజాన్ ఇండియా. ఇందులో భాగంగా, ఈ రోజు నుండి 8 వ తేదీ వరకూ, షావోమి యొక్క రెడ్మి 6A, రెడ్మి Y2, మరియు మి A2 స్మార్ట్ ఫోన్ల పైన గొప్ప డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందిస్తోంది. ఈ అమేజాన్ యొక్క ప్రత్యేకమైన సేల్, రోజు  మధ్యాహ్నం 12 గంటలకి మరియు తిరిగి మధ్యాహ్నం 3 గంటలకి జరుగుతుంది. పరిమితకాల అఫర్ కాబట్టి ముందుగా ఎంచుకున్నవారు కొనుగోలు చేయవచ్చు.

షావోమి రెడ్మి 6A

ఒక 5.45 అంగుళాల ఫుల్ వ్యూ డిస్ప్లే మరియు 13MP ప్రధాన కెమేరా కలిగిన, ఈ షావోమి రెడ్మి 6A యొక్క 2GB/16GB వేరియంట్  ప్రస్తుత ధర రూ. 6,999 గా ఉండగా, దీని పైన 1000 రుపాయల డిస్కౌంట్ తో రూ. 5,999 ధరకి అందిస్తోంది అమెజాన్. అలాగే, 2GB/32GB వేరియంట్  ప్రస్తుత ధర రూ. 7,999 గా ఉండగా, దీని పైన 1000 రుపాయల డిస్కౌంట్ తో రూ. 6,999 ధరకి అందిస్తోంది.  జియో వినియోగదారులకి 2200 రూపాయల ఇన్స్టాంట్ కాష్ బ్యాక్ మరియు అధనపు 100GB ల 4G డేటా కూడా అందిస్తోంది.

షావోమి రెడ్మి Y2

ఒక 5.99 అంగుళాల ఫుల్ స్క్రీన్ డిస్ప్లే మరియు డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ కలిగిన, ఈ షావోమి రెడ్మి Y2 యొక్క 3GB/32GB వేరియంట్  ప్రస్తుత ధర రూ. 10,499 గా ఉండగా, దీనిపైన డిస్కౌంట్ అందించి రూ. 8,999 ధరకి అందిస్తోంది అమెజాన్. అలాగే, 4GB/64GB వేరియంట్  ప్రస్తుత ధర రూ. 13,499 గా ఉండగా, దీనిపైన డిస్కౌంట్ అందించి డిస్కౌంట్ తో రూ. 10,999 ధరకి అందిస్తోంది.

షావోమి మి A 2 

ఒక 5.99 అంగుళాల ఫుల్ HD+ డిస్ప్లే మరియు డ్యూయల్ రియా కెమేరా కలిగిన, ఈ షావోమి మి A2 యొక్క 4GB/64GB వేరియంట్  ప్రస్తుత ధర రూ. 17,499 గా ఉండగా, దీని పైన 2500 రుపాయల డిస్కౌంట్ తో రూ. 14,999 ధరకి అందిస్తోంది అమెజాన్. అలాగే, 6GB/128GB వేరియంట్  ప్రస్తుత ధర రూ. 20,500 గా ఉండగా, దీని పైన 3500 రుపాయల డిస్కౌంట్ తో రూ. 16,999 ధరకి అందిస్తోంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :