షావోమి నుండి త్వరలోనే రానున్న MIUI 11 ROM

HIGHLIGHTS

ఈ కొత్త అప్డట్ అందుకోనున్న షావోమి యొక్క 38 స్మార్ట్ ఫోన్లు.

షావోమి నుండి త్వరలోనే రానున్న MIUI 11 ROM

త్వరలోనే, షావోమి యొక్క కొత్త  బీటా అప్డేట్లను విడుదల చేయనుంది మరియు ముందుగా వచ్చిన MIUI 10 కి అప్డేటుగా కొన్ని కొత్త ఫీచర్లను కూడా జోడించింది. ఇంతకు ముందు,  MIUI యొక్క తదుపరి అప్డేటును అందించడం కోసం పనిచేస్తున్నట్లు, కంపెనీ జనవరిలోనే ధృవీకరించింది. ముందుగా, MyDrivers ద్వారా వచ్చిన ఒక కొత్త నివేదిక, ఈ అప్డేట్ కోసం అర్హత కలిగిన షావోమి యొక్క ఫోన్ల జాబితాను కూడా అందించింది.  రాబోయే షావోమి ROM లో అందించనున్న కొత్త విషయాల సమాచారం కూడా అందించబడింది. ఈ రిపోర్టు ప్రకారం, షావోమి  పూర్తిగా కొత్త ROM తో ముందున్న ROM ను పూర్తిగా ఒక కొత్త ఇంటర్ఫేసుతో పునఃరూపకల్పన చేయడానికి చూస్తోంది. అలాగే, దీని గురించి వివరిస్తూ "స్మూత్ అండ్ బ్యూటిఫుల్," "న్యూ ఐకాన్," "గ్లోబల్ నైట్ మోడ్" వంటి థీమ్ లను అమలు చేయండంతో పాటుగా మరిన్ని కొత్త ఫీచర్లని ఈ కొత్త అప్డేట్ తీసుకొస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ నివేదిక ప్రకారం, కొత్త MIUI 11 ROM ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. సంస్థ దాని ప్రామాణిక విడుదల షెడ్యూల్ చేయడానికి కనుక కట్టుబడి ఉంటే, త్వరలోనే   ఇది విడుదల కావచ్చు. అయితే, ముందువచ్చిన నివేదికలు  ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించనున్న Mi 9 స్మార్ట్ ఫోనుతో పాటుగా, ఈ కొత్త MIUI 11 ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు Mi 9 స్మార్ట్ ఫోను వచ్చింది కాబట్టి, ఈ అప్డేట్ కూడా అతిత్వరలో  రావచ్చని అంచనా వస్తున్నారు.

ఈ కొత్త ROM అప్డేట్  స్వీకరణకు అనుమతిగల హ్యాండ్ సెట్ల యొక్క జాబితాను కూడా ప్రకటించారు.  షావోమి యొక్క ఆ స్మార్ట్ ఫోన్ల  జాబితా చుస్తే గనుక : షావోమి మి 9, మి 8, మి 6X, మి 6, మి 5c, మి 5X, మి 5s, మి 5s ప్లస్ మరియు మి ప్లే వంటివి ఉన్నాయి. ఇంకా, మి మిక్స్ సిరీస్లో, మి మిక్స్ 3, మి మిక్స్ 2S, మి మిక్స్ 2, మరియు మి మిక్స్ 1 లను,  ఈ కొత్త MIUI ROM తో అప్డేటుచేయవచ్చు. అలాగే,  మి నోట్ 2, మి నోట్ 3, మి మాక్స్ 2, మి మాక్స్, మి మాక్స్ 3, ఇతర డివైజెస్ కూడా ఉంటాయి.

రెడ్మి 6, రెడ్మి 6A, రెడ్మి 5, రెడ్మి 5A, రెడ్మి 5 ప్లస్, రెడ్మి 4X, రెడ్మి 4, రెడ్మి 4A, రెడ్మి 3S / 3X, మరియు రెడ్మి S2 వంటి కొన్ని రెడ్మి ఫోన్లు కూడా ఈ జాబితాలో భాగంగా ఉన్నాయి. రెడ్మి నోట్ 4, రెడ్మి నోట్ 4X, రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రో, రెడ్మి నోట్ 5A, రెడ్మి 6 ప్రో, రెడ్మినోట్ 6, రెడ్మి నోట్ 6 ప్రో, రెడ్మినోట్ 7, మరియు ఇంకా ప్రకటించని రెడ్మి నోట్ 7 ప్రో కూడా ఈ ఆరోపించబడిన MIUI 10 మరుసటి అప్డేట్ జాబితాలో భాగంగా ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo