SAMSUNG Galaxy S22 5G పైన ఫ్లిప్ కార్ట్ Winter Fest Sale భారీ డిస్కౌంట్.!

HIGHLIGHTS

Winter Fest Sale ను అనౌన్స్ చేసింది Flipkart

ఈ సేల్ నుండి SAMSUNG Galaxy S22 5G పైన భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

ఫ్లిప్ కార్ట్ సేల్ డిస్కౌంట్ ఆఫర్ దెబ్బకి చవక ధరకే శామ్సంగ్ ప్రీమియం ఫోన్

SAMSUNG Galaxy S22 5G పైన ఫ్లిప్ కార్ట్ Winter Fest Sale భారీ డిస్కౌంట్.!

అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లతో Winter Fest Sale ను అనౌన్స్ చేసింది Flipkart. ఈ లేటెస్ట్ సేల్ ను డిసెంబర్ 23 నుండి డిసెంబర్ 31వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ నుండి గొప్ప డిస్కౌంట్ ఆఫర్ తో చాలా ప్రోడక్ట్స్ ను సేల్ చేసింది. అయితే, ఈ సేల్ నుండి SAMSUNG Galaxy S22 5G పైన అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ ను గురించి ప్రత్యేకంగా చూడవచ్చు. ఎందుకంటే, ఈ స్మార్ట్ ఫోన్ ను దాదాపుగా రూ. 16,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో మిడ్ రేంజ్ ధరలో ఫ్లిప్ కార్ట్ సేల్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

SAMSUNG Galaxy S22 5G Offer

ఫ్లిప్ కార్ట్ వింటర్ ఫెస్ట్ సేల్ నుండి ఈరోజు శామ్సంగ్ గెలాక్సీ ఎస్22 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 35,999 రూపాయల డిస్కౌంట్ ధరకే అందించింది ఫ్లిప్ కార్ట్. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో రూ. 51,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ చెయ్యబడింది. అయితే, ఫ్లిప్ కార్ట్ సేల్ డిస్కౌంట్ ఆఫర్ దెబ్బకి ఈ ఫోన్ ఈరోజు కేవలం రూ. 35,999 రూపాయల ధరకే లభిస్తోంది.

అంతేకాదు, ఈ ఫోన్ పైన ఎక్స్ ఛేంజ్ బోనస్ ఆఫర్ మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా జత చేసింది. ఈ ఫోన్ ను DFC FIRST Bank Credit Card EMI ఆఫర్ ద్వారా కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ OneCard Credit Card EMI తో కొనే కస్టమర్లకు కూడా వర్తిస్తుంది. ఇవి మాత్రమే కాదు, మరిన్ని బ్యాంక్ కార్డ్స్ పైన కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Also Read: POCO M6 5G: 50MP డ్యూయల్ కెమేరా మరియు 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ధరలో వచ్చింది.!

శామ్సంగ్ గెలాక్సీ ఎస్22 5జి ప్రత్యేకతలు

ఇక ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే, శామ్సంగ్ ఈ ఫోన్ ను Snapdragon 8 Gen 1 ఫాస్ట్ ప్రోసెసర్ తో అందించింది. ఈ శామ్సంగ్ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 128GB అంతర్గత స్టోరేజ్ ఉన్నాయి. Gorilla Glass Victus ప్రొటెక్షన్ కలిగిన 6.1 ఇంచ్ Dynamic AMOLED 2X డిస్ప్లేని Full HD+ రిజల్యూషన్ తో కలిగి వుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మరియు HD గేమింగ్ సపోర్ట్ తో వస్తుంది.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్22 5జి ప్రత్యేకతలు

కెమేరాల పరంగా, శామ్సంగ్ గెలాక్సీ ఎస్22 5జి స్మార్ట్ ఫోన్ వెనుక 50MP + 12MP + 10MP కెమేరా సెటప్ కలిగి వుంది. ఇది 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు అద్భుతమైన ఫోటోలను చిత్రీకరించ గలదు. ఈ ఫోన్ IP68 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది మరియు 3700 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo