Flipkart రిపబ్లిక్ డే సేల్ నుండి VIVO Z1 Pro పైన Rs.5,000 భారీ డిస్కౌంట్

Updated on 19-Jan-2020
HIGHLIGHTS

32MP పంచ్ హోల్, వెనుక ట్రిపుల్ కెమెరాతో వస్తుంది.

వివో నుండి కేవలం బడ్జెట్ ధరలో,  ఒక పంచ్ హోల్ సెల్ఫీ కెమేరా మరియు వెనుక ట్రిపుల్ కెమేరాతో ఇండియాలో  లాంచ్ చేసిన VIVO Z1 PRO స్మార్ట్ ఫోన్ను ఇప్పుడు చాలా తక్కువ ధరకే  మీ సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి, ముందుగా రూ.15,990 రుపాయల ధరలో ఇండియాలో అమ్ముడైన ఈ స్మార్ట్ ఫోన్ పైన Flipkart నుండి జరుగుతున్న "The Republic Sale" నుండి  గరిష్టంగా 5,000 రూపాయల భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటుగా వేగవంతమైన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC తో వస్తుంది. అధనంగా, ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు Kotak బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డుతో కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.    

వివో జెడ్ 1 ప్రో : అఫర్ ధరలు

Vivo Z 1 Pro (4GB + 64GB)  సేల్ ధర : Rs. 10,990

Vivo Z 1 Pro (6GB + 64GB)  సేల్ ధర : Rs. 11,990

 Vivo Z 1 Pro (6GB + 128GB)  సేల్ ధర : Rs. 13,990

VIVO Z1 PRO ప్రత్యేకతలు

ఈ వివో Z1 ప్రో, డిస్ప్లే లోపల ఒక పంచ్ హోల్ డిజైనుతో ఒక 90.77 స్క్రీన్ టూ బాడీ రేషియాతో  2340×1080 పిక్సెళ్ళు గల ఒక 6.3-అంగుళాల FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోను ఒక బ్యాక్ -మౌంటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది. ఈ ఫోన్ గరిష్టంగా 2.3 క్లాక్ స్పీడ్ అందించగల ఒక 10nm finfit కలిగిన క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 712 AIE SoC కి జతగా 4GB లేదా 6GB RAM వేరియంట్లలో 64GB లేదా 128GB స్టోరేజిలలో లభిస్తాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5,000 mAh బ్యాటరీ మరియు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది

వివో Z1 ప్రో యొక్క కెమేరా విభాగానికి వస్తే, ఇది  పోర్ట్రైట్ షాట్లకు అనుగుణంగా ఒక 5MP మూడవ సెన్సారుతో జతగా కలిపిన ప్రధాన 16MP సెన్సారు మరియు మరొక 8MP సూపర్ అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన ట్రిపుల్ రియార్ కెమేరాతో ఉంటుంది. ఈ వివో Z1 ప్రో యొక్క 16MP ప్[ప్రధాన కెమేరా f/1.78 అపర్చరుతో అందించబడింది.  ఇది తక్కువ కాంతి లో కూడా మంచి షాట్లు తీసుకోవటానికి సహాయపడుతుంది. ఇక ముందుభాగంలో, పోర్త్రైట్ మోడ్  మరియు పేస్ బ్యూటిఫికేషన్ కి సపోర్ట్ చేసేలా, AI అల్గారిథం కలిగిన ఒక 32MP కెమెరా ఉంటుంది .                        

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :