Vivo T5 Pro 5G స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ సేల్ భారీ డీల్స్ అందుకోండి.!

HIGHLIGHTS

Vivo T5 Pro 5G ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ భారీ డీల్స్ అందుకోండి అంటోంది ఫ్లిప్ కార్ట్

SASA LELE నుంచి అందించిన అర్లీ బర్ద్ డీల్స్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ డీల్ ను అందించింది

ఈ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో మీ సొంతం చేసుకోవచ్చు

Vivo T5 Pro 5G ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ సేల్ భారీ డీల్స్ అందుకోండి అంటోంది ఫ్లిప్ కార్ట్. SASA LELE నుంచి అందించిన అర్లీ బర్ద్ డీల్స్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ డీల్ ను అందించింది. రీసెంట్ గా వివో విడుదల చేసిన మిడ్ రేంజ్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ గా పేరు తెచ్చుకున్న ఈ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో మీ సొంతం చేసుకోవచ్చు.

Vivo T5 Pro 5G : ఆఫర్

ఫ్లిప్ కార్ట్ సాసా లేలే సేల్ నుంచి ఈ అర్లీ బర్ద్ డీల్ ను అందించింది. వివో టి5 ప్రో స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ను రూ. 29,999 ప్రైస్ తో లిస్ట్ చేసిన ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ పై రెండు డీల్స్ అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ మరియు రూ. 1,250 రూపాయల SBI క్రెడిట్ కార్డు డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 27,749 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు.

Also Read: Vivo X300 FE: కాంపాక్ట్ సైజులో జబర్దస్త్ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

Vivo T5 Pro 5G : ఫీచర్స్

వివో టి 5 ప్రో స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.83 ఇంచ్ బిగ్ AMOLED స్క్రీన్ ని 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR10+ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 50MP (Sony IMX882, OIS) మెయిన్ మరియు 2MP కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చిన ఏకైక 9020 mAh భారీ బ్యాటరీ ఫోన్ గా నిలుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 90W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ వివో ఫోన్ IP 69 రేటింగ్ వాటర్ ప్రొటెక్షన్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :