Flipkart Sale చివరి రోజు Moto G54 5G పైన ధమాకా ఆఫర్.!

HIGHLIGHTS

Flipkart Diwali Dhamaka Sale ఈరోజుతో ముగుస్తుంది.

Flipkart Sale చివరి రోజు Moto G54 5G పైన ధమాకా ఆఫర్

ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ రూ. 3,000 భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

Flipkart Sale చివరి రోజు Moto G54 5G పైన ధమాకా ఆఫర్.!

దీపావళి 2023 సందర్భంగా ఫ్లిప్ కార్ట్ నవంబర్ 12 నుండి నవంబర్ 15 వరకూ ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన Diwali Dhamaka Sale ఈరోజుతో ముగుస్తుంది. అందుకే కాబోలు Flipkart Sale చివరి రోజు Moto G54 5G పైన ధమాకా ఆఫర్ ను ప్రకటించింది. ఇటీవల ఇండియన్ మార్కెట్ లో బడ్జెట్ ధరలో 12 GB ర్యామ్ తో అందించిన స్మార్ట్ ఫోన్ మోటోరోలా జి54 5జి పైన ఈ ధమాకా ఆఫర్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Sale big deal

ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజైన ఈరోజు మోటోరోలా మోటో జి54 5జి స్మార్ట్ ఫోన్ 12GB ర్యామ్ వేరియంట్ ను రూ. 15,999 రూపాయల డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది. వాస్తవానికి, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 18,999 ధరతో విడుదల చేసింది. అయితే, ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ రూ. 3,000 భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. అలాగే, 8GB ర్యామ్ వేరియంట్ కూడా రూ. 2,000 డిస్కౌంట్ తో రూ. 13,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.

Also Read : Vivo X100 Series: భారీ ఫీచర్స్ తో వచ్చిన వివో New ఫోన్లు | Tech News

Moto G54 5G Specs

మోటో జి54 5జి స్మార్ట్ ఫోన్ 6.5 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 120 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ మోటో 5జి స్మార్ట్ ఫోన్ MediaTek Dimensity 7020 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఈ వేగవతమైన ప్రోసెసర్ కి జతగా 12 GB RAM మరియు 256 GB హెవీ స్టోరేజ్ లను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మిడ్ నైట్ బ్లూ, మింట్ గ్రీన్ మరియు పర్ల్ బ్లూ అనే మూడు కలర్స్ లో లభిస్తుంది.

Moto G54 5G Specs and Flipkart sale deal
మోటో జి54 5జి

ఈ మోటో ఫోన్ 50MP (OIS) + 8MP రియర్ కెమేరా సెటప్ ను Dolby Atmos మరియు మోటో Spatial సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కలిగివుంది. ఈ ఫోన్ లో 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ ను మోటోరోలా 6000 mAh హెవీ బ్యాటరీని 33 W
Turbo Power ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo