Flipkart Sale early bird deal announced on POCO F7 5G
పోకో లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ POCO F7 5G పై ఈరోజు Flipkart Sale అర్లీ బర్డ్ డీల్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో జబర్దస్త్ ఫీచర్స్ తో వచ్చిన ఫోన్ గా మార్కెట్ వర్గాల నుంచి మంచి పేరు తెచ్చుకుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ SASA LELE సేల్ సందర్భంగా ఇప్పుడు మంచి డిస్కౌంట్ దగరలో లభిస్తోంది.
పోకో ఎఫ్ 7 స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 33,999 రూపాయల బేసిక్ ప్రైస్ తో సేల్ అవుతోంది. ఈ ఫోన్ పై HDFC, ICICI మరియు SBI క్రెడిట్ కార్డు రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ పోకో ఫోన్ కేవలం రూ. 31,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ పై మంచి ఎక్స్ చేంజ్ బోనస్ కూడా అందుకోవచ్చు.
ఈ పోకో స్మార్ట్ ఫోన్ 6.83 అంగుళాల AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్, HDR10+ మరియు Dolby Vision సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 21 లక్షల కంటే అధిక AnTuTu స్కోర్ అందించే Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో నడుస్తుంది. అంతేకాదు, ఈ పవర్ ఫుల్ చిప్ సెట్ తో జతగా 12GB LPDDR5X ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇది మిడ్ రేంజ్ ధరలో వచ్చే హై పర్ఫార్మెన్స్ గేమింగ్ ఫోన్ గా చెప్పవచ్చు.
ఈ స్మార్ట్ ఫోన్ OIS సపోర్ట్ కలిగిన 50MP మెయిన్ కెమెరా జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 20MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60FPS తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు గొప్ప AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫోటో క్వాలిటీ ఆకట్టుకునే స్థాయిలో ఉంటుంది. కానీ, ఈ ఫోన్ ప్రధానంగా పర్ఫార్మెన్స్ ఫోకస్ ఫోన్ అని గమనించాలి.
Also Read: Google Pixel 11: పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు AI శక్తితో వచ్చే అవకాశం.!
ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఈ ఫోన్ 7550 mAh భారీ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 22.5W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ తో కూడా అందించింది. ఈ ఫోన్ అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టం, IP66, IP68, IP69 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ మరియు డ్యూయల్ గ్లాస్ డిజైన్ తో ఉంటుంది.