Flipkart revealed SASA LELE Sale big smartphone deals
SASA LELE Sale స్టార్ట్ కావడానికి ఇంకా వారం రోజులు ఉండగా Flipkart మాత్రం ఈ రోజు నుంచి బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను సైతం భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ కొత్తగా తీసుకొచ్చిన ఈ బిగ్ సేల్ డేట్ అండ్ ఆఫర్స్ ఏమిటో చూద్దామా.
ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ మీ 9వ తేదీ నుంచి అందరికీ ప్రారంభం అవుతుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ ప్లస్ మరియు బ్లాక్ యూజర్లకు 24 గంటల ముందుగానే ఈ సేల్ యాక్సెస్ లభిస్తుంది. ఈ సేల్ నుంచి సౌండ్ బార్, ల్యాప్ టాప్, స్మార్ట్ వాచ్, స్మార్ట్ టీవీ మరియు స్మార్ట్ ఫోన్ లను గొప్ప డిస్కౌంట్ తో పొందవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది. అయితే, ఈరోజు ఈ సేల్ నుంచి అందించనున్న టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్ రివీల్ చేసింది.
ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ నుంచి మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ తో ఎన్నడూ చూడనంత చవక ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ దెల రివీల్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 22,999 ధరతో సేల్ అవుతుండగా, ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం రూ. 19,999 లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ డీల్ రివీల్ చేసింది.
ఇది కాకుండా ఇదే బ్రాండ్, అంటే మోటోరోలా యొక్క మోటో G57 పవర్, మోటో G96, మోటో G57 పవర్ మరియు మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ వంటి మరిన్ని మోటోరోలా ఫోన్స్ పై కూడా భారీ డిస్కౌంట్లు అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.
Also Read: మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా నిలిచిన OnePlus Realme విలీనం
ఈ సేల్ నుంచి శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 FE స్మార్ట్ ఫోన్ కూడా మంచి డిస్కౌంట్ ధరలో పొందొచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేసింది. ఇది కాకుండా పోకో లేటెస్ట్ ప్రీమియం ఫోన్ X0 ప్రో మాక్స్ ఫోన్ ను మంచి ఆఫర్ ధరలో పొందొచ్చు. అంతేకాదు, ఆపిల్ లేటెస్ట్ సిరీస్ ఐఫోన్ మరియు వివో లేటెస్ట్ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ పైన కూడా గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందుకునే అవకాశం ఉందని ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ కోసం ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి డీల్స్ రివీల్ చేసింది.