Flipkart సేల్ నుండి Poco X3 Pro పైన బంపర్ డీల్స్

Updated on 29-Oct-2021
HIGHLIGHTS

POCO X3 PRO ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి బంపర్ డీల్స్ తో లభిస్తోంది

పోకో X3 ప్రో స్మార్ట్ ఫోన్ పైన ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అందిస్తోంది

ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి కేవలం బడ్జెట్ ధరలోనే పొందవచ్చు

ఇటీవల ప్రీమియం ఫీచర్లతో వచ్చిన POCO X3 PRO స్మార్ట్ ఫోన్  ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుండి బంపర్ డీల్స్ తో లభిస్తోంది. ఈ లేటెస్ట్ పోకో స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్పీడ్ ప్రోసెసర్ Snapdragon 860 SoC మరియు UFS 3.1 అల్ట్రా ఫాస్ట్ స్టోరేజ్ వంటి చాలా హై ఎండ్ ఫీచర్ లతో వచ్చింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి కేవలం బడ్జెట్ ధరలోనే పొందవచ్చు.

Poco X3 Pro: అఫర్ ధరలు

1. పోకో X3 ప్రో (6GB + 128GB) ధర : Rs.16,999

2. పోకో X3 ప్రో (8GB + 128GB) ధర : Rs.18,999   

పోకో X3 ప్రో స్మార్ట్ ఫోన్ పైన ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అందిస్తోంది. SBI క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here 

Poco X3 Pro: ప్రత్యేకతలు

ఈ Poco X3 Pro స్మార్ట్ ఫోన్ ఒక 6.67-అంగుళాల Full HD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240 Hz టచ్ శాంప్లింగ్ రేటుతో పాటుగా సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో పంచ్-హోల్ డిజైన్ తో వుంటుంది. ఈ స్క్రీన్ యొక్క రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 6 ని అందించింది. ఈ ఫోన్ వెనుక భాగంలో పోకో X3 మాదిరిగా చదరపు ఆకారంలో గల కెమెరా సెటప్ ఉంది మరియు 215 గ్రాముల బరువున్న ఈ ఫోన్ 9.4 మిమీ మందంతో వస్తుంది.

ఈ ఫోన్ గరిష్టంగా 2.96GHz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ కలిగి ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 640 GPU తో పనిచేస్తుంది. ఇది 6GB/8GB RAM మరియు 128GB UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12 పై పోకో లాంచర్ తో నడుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను వేగంగా చల్లబరచడానికి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ప్లస్ ఫీచర్ ని కూడా అందించింది.  

పోకో X3 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తుంది. దీనిలో ప్రాధమిక 48MP కెమెరాని , 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాని, 2MP మాక్రో కెమెరాని మరియు 2MP డెప్త్ సెన్సార్ తో కలిగివుంది. ముందు భాగంలో, ఈ ఫోన్ పైభాగంలో పంచ్ హోల్ కటౌట్ లోపల 20 MP  సెల్ఫీ కెమెరా ఉంది.

ఇది సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5,160 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 33W ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్-ఆఫ్-బాక్స్ తో వస్తుంది. ఇక ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ 6GB + 128GB వేరియంట్ EUR 199 ధరతో ప్రకటించింది.

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :