Flipkart OMG ఆఫర్: రూ. 19,999 ధరకే iPhone 12 Mini ఫోన్ ను లిస్ట్ చేసిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

iPhone 12 Mini ఫోన్ ను కేవలం రూ. 19,999 ఆఫర్ ధరకే లిస్ట్

Flipkart OMG ఆఫర్ నిజంగా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం

ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఐఫోన్ 12 మినీ ఫోన్ ను రూ. 19,999 డిస్కౌంట్ ధరకు లిస్ట్ చేసింది

Flipkart OMG ఆఫర్: ఫ్లిప్ కార్ట్ ది బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలు కావడానికి వారం రోజుల సమయం ఉండగానే ఈరోజు భారీ ఆఫర్ ను లిస్ట్ చేసింది. కలలో కూడా ఊహించని విధంగా iPhone 12 Mini ఫోన్ ను కేవలం రూ. 19,999 ఆఫర్ ధరకే లిస్ట్ చేసింది. ఇది నిజంగా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం మరియు ఈ ఫోన్ ఐఫోన్ ప్రీమియం ఫోన్ లకు సాటివచ్చే కెమెరా మరియు OLED స్క్రీన్ వంటి గొప్ప ఫీచర్స్ ను కలిగి వుంది.

Flipkart OMG ఆఫర్

ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆపిల్ ఐఫోన్ 12 మినీ ఫోన్ ను రూ. 19,999 డిస్కౌంట్ ధరకు లిస్ట్ చేసింది. ఈ ఫోన్ ను ఎప్పుడు చూడని అతి తక్కువ దారి ఇదే ఐ క్లియర్ గా చూడవచ్చు. ఈ ఫోన్ యొక్క 64GB వేరియంట్ ను ఈ ధరతో లిస్ట్ చేసింది. అయితే, 12GB వేరియంట్ ను రూ. 24,999 ధరతో, 256GB వేరియంట్ ను రూ. 29,999 ధరతో లిస్ట్ చేసింది.

iPhone 12 Mini

వాస్తవానికి, ఈ ఫోన్ ఇప్పటివరకు ఎన్నడూ ఇంత తక్కువ ధరకు లిస్ట్ అవ్వలేదు. అయితే, ఈ ఫోన్ ప్రొడక్షన్ ను కంపెనీ నిలిపివేయడం వలన ఈ ఫోన్ ప్రస్తుత ధర వివరాలు కూడా క్లియర్ గా తెలిసే అవకాశం ఉండదు. కానీ, ఈ ఫోన్ లిస్ట్ అయింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ మరియు ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో కూడా చెప్పలేదు. ఇది ఒకవేళ లిమిటెడ్ పీరియడ్ లేదా స్టాక్ క్లియరెన్స్ ఆఫర్ అయితే, స్టాక్ అయిపోగానే సేల్ ముగుస్తుంది.

ఇక ఈ ఐఫోన్ 12 మినీ ఫోన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 5.4ఇంచ్ OLED స్క్రీన్ పటిష్టమైన గ్లాస్ మెటల్ శాండ్విచ్ డిజైన్ మరియు పవర్ ఫుల్ 12MP + 12MP డ్యూయల్ కెమెరా సెటప్ తో ఉంటుంది. ఈ ఫోన్ 4K Dolby Vision వీడియోస్ ను షూట్ చేసే సత్తా కలిగి ఉంటుంది మరియు A14 Bionic చిప్ సెట్ తో పని చేస్తుంది.

Also Read: Samsung Galaxy M55s: సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అవుతున్న శామ్సంగ్ ఫోన్.!

అయితే, ఈ యాపిల్ ఐఫోన్ బ్యాటరీ బ్యాకప్ మరియు స్టోరేజ్ గా నిరుత్సాహపరుస్తుంది. అయితే, ఐఫోన్ ను ఒక్కసారైనా ఉపయోగించాలి అని ఎదురు చూసే బడ్జెట్ యూజర్ కి ఈ డీల్ ఒక గొప్ప వరం అవుతుంది. కానీ మార్కెట్ లో ఈ బడ్జెట్ ధరలో మరిన్ని ఫీచర్లు కలిగిన చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :