flipkart goat sale early bird sale offers rs 20,000 discount on Motorola Razr Fold
Motorola Razr Fold పై ఫ్లిప్ కార్ట్ GOAT Sale ఎర్లీ బర్డ్ సేల్ రూ. 20,000 భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. మోటోరోలా ఫోల్డ్ ఫోన్ కొనాలని ఎదురు చూసే వారికి ఇది గొప్ప సదవకాశం అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్ట్రాంగ్ ఫోల్డబుల్ ఫోన్ గా నిలుస్తుంది మరియు 8K వీడియోస్ రికార్డు చేయగలిగే కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఎర్లీ బర్డ్ సేల్ రూ. 20,000 భారీ డిస్కౌంట్ అందించింది.
మోటోరోలా రేజర్ ఫోల్డ్ ఫోన్ రూ. 1,49,999 ప్రారంభ ధరతో ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ గోట్ ఎర్లీ బర్డ్ సేల్ నుంచి ఇదే ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. అయితే, ఈ ఫోల్డ్ ఫోన్ పై రెండు బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ రూ. 1,29,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది.
ఈ మోటోరోలా ఫోల్డ్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 10,000 రూపాయల ఎక్స్ చేంజ్ మరియు రూ. 10,000 రూపాయల ICICI, HDFC అండ్ Axis బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ రూ. 1,29,999 ధరలో లభిస్తుంది.
Also Read: సినిమాటిక్ సౌండ్ తో Sony BRAVIA Theatre Bar 7 సౌండ్ బార్ లాంచ్ చేసిన సోనీ.!
మోటోరోలా రేజర్ ఫోల్డ్ ఫోన్ అనేది మోటోరోలా నుంచి వచ్చిన మొదటి బుక్-స్టైల్ ఫోల్డబుల్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్. ఇందులో 8.1-అంగుళాల LTPO ఫోల్డబుల్ మెయిన్ డిస్ప్లే మరియు 6.6-అంగుళాల LTPO కవర్ డిస్ప్లే ఉంటాయి. ఈ ఫోన్ మెయిన్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, 6,000 నిట్స్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ మరియు HDR 10+ సపోర్ట్ వంటి ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 చిప్ సెట్ జతగా 12GB / 16GB LPDDR5X ర్యామ్ కలిగి ఉంటుంది.
కెమెరా విభాగంలో, ఈ ఫోన్ 50MP Sony LYTIA మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ + మాక్రో కెమెరా మరియు 50MP పెరిస్కోప్ టెలిఫోటో రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఇందులో 32MP కవర్ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా మరియు 20MP ఇన్నర్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటాయి. ఈ ఫోన్ 8K వీడియో రికార్డింగ్, 60FPS 4K వీడియో రికార్డింగ్ మరియు AI కెమెరా ఫీచర్లు కలిగి ఉంటుంది.
ఈ ఫోల్డ్ ఫోన్ 6000mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను 80W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్ లెస్ ఛార్జింగ్ మరియు రివర్స్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ప్రీమియం మెటల్ ఫ్రెమ్ డిజైన్ మరియు IP49 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సెటప్ తో వస్తుంది.