Flipkart Freedom Sale బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ రివీల్ చేసిన ఫ్లిప్ కార్ట్ .. లేటెస్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు అందుకోండి.!

HIGHLIGHTS

Flipkart Freedom Sale ఈ వారం చివరికి ప్రారంభం అవుతుంది

ఈ సేల్ నుంచి ఆఫర్ చేయబోతున్న బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ను మాత్రం ఈ రోజు రిలీజ్ చేసింది

టాప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ కొన్ని ఈరోజు రిలీజ్ చేసింది

Flipkart Freedom Sale ఈ వారం చివరికి ప్రారంభం అవుతుంది. అయితే, ఈ సేల్ నుంచి ఆఫర్ చేయబోతున్న బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ను మాత్రం ఈ రోజు రిలీజ్ చేసింది. కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూసే వారికి ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2026 గొప్ప అవకాశం అందిస్తుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ సేల్ నుంచి లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ లను సైతం మంచి ఆఫర్ ధరలో అందుకోవచ్చని కూడా ఫ్లిప్ కార్ట్ చెబుతోంది. ఈ సేల్ నుంచి అందించిన టాప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ కొన్ని ఈరోజు రిలీజ్ చేసింది. ఆ డీల్స్ ఏమిటో ఒక లుక్కేద్దామా.

Flipkart Freedom Sale : స్మార్ట్ ఫోన్ ఆఫర్స్

ఈరోజు ఫ్లిప్ కార్ట్ అప్ కమింగ్ సేల్ స్మార్ట్ ఫోన్ డీల్స్ రిలీజ్ చేసింది. ఇందులో మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ను టాప్ డీల్ గా నిలబెట్టింది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 30,999 ధరతో సేల్ అవుతోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి కేవలం రూ. 27,999 ఆఫర్ ధరలో అందుకోవచ్చని తెలిపింది. ఇది Sony కెమెరా సిస్టం, 7000 mAh బ్యాటరీ, 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కలిగి ఉంటుంది.

రెండోది కూడా మోటోరోలా నుంచి వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్. అదేమిటంటే, మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను కేవలం రూ. 36,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ. 39,999 రూపాయల ధరలో సేల్ అవుతోంది.

Also Read : Poco M8 Power: 16GB ర్యామ్ మరియు 8000 mAh బ్యాటరీ వంటి భారీ ఫీచర్స్ తో రేపు లాంచ్ అవుతోంది.!

Flipkart Freedom Sale : టాప్ డీల్స్

ఈ సేల్ నుంచి ఆఫర్ చేయనున్న డీల్స్ లో లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, గూగుల్ పిక్సెల్ 10a స్మార్ట్ ఫోన్ ఈ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ప్రస్తుతం 55,999 ధరలో సేల్ అవుతోంది. అయితే, ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ నుంచి ఈ ఫోన్ ను రూ. 50,999 రూపాయల ఆఫర్ ధరలో పొందొచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

కేవలం పిక్సెల్ 10a స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు గూగుల్ పిక్సెల్ 10, పిక్సెల్ 10 ప్రో XL మరియు పిక్సెల్ 10 ప్రో స్మార్ట్ ఫోన్లు కూడా మంచి ఆఫర్ ధరలో లభిస్తాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ టాప్ అండ్ బెస్ట్ డీల్స్ అప్‌డేట్ తో మళ్ళి కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :