Flipkart సేల్ నుండి Redmi K20 Pro పైన రూ.6,000 భారీ డిస్కౌంట్

Flipkart సేల్ నుండి Redmi K20 Pro పైన రూ.6,000 భారీ డిస్కౌంట్
HIGHLIGHTS

Redmi K20 Pro అప్పట్లో కేవలం 30 వేల రూపాయల ధరలో బెస్ట్ ఫీచర్లతో వచ్చిన స్మార్ట్ ఫోనుగా నిలిచింది.

Flipkart Big Saving Days సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ పైన ప్రకటించిన రూ.6,000 భారీ డిస్కౌంట్ తరువాత మరింత చవక ధరకే అమ్ముడవుతోంది.

షావోమి ఈ రెడ్మి K20 ప్రో ఫోనులో ఒక 7 వ జనరేషన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరును పరిచయం చేసింది.

గత సంవత్సరం చాలా తక్కువ ధరలో స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్, వెనుక ట్రిపుల్ కెమెరా, పాప్ అప్ సెల్ఫీ కెమెరాతో పాటుగా గేమింగ్ టర్బో 2.0 వంటి చాలా గొప్ప వచ్చిన Redmi K20 Pro అప్పట్లో కేవలం 30 వేల రూపాయల ధరలో బెస్ట్ ఫీచర్లతో వచ్చిన స్మార్ట్ ఫోనుగా నిలిచింది. అయితే, ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన Flipkart Big Saving Days సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ పైన ప్రకటించిన రూ.6,000 భారీ డిస్కౌంట్ తరువాత మరింత చవక ధరకే అమ్ముడవుతోంది.                      

Flipkart Big Saving Days అఫర్ ధరలు

Redmi K20 Pro  (Buy Here)

రెడ్మి K20 ప్రో (6GB + 128GB) ధర – Rs.22,999 

Redmi K20 Pro  :  ప్రత్యేకతలు

షావోమి ఈ రెడ్మి K20 ప్రో ఫోనులో ఒక 7 వ జనరేషన్  ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరును పరిచయం చేసింది. ఈ K20 ప్రో స్మార్ట్ ఫోన్ ఒక 6.39 అంగుళాల FHD+  AMOLED డిస్ప్లేతో వస్తుంది. అయితే, ఇందులో ఎటువంటి నోచ్ లేకుండా పూర్తి డిస్ప్లేతో అందించింది. ఎందుకంటే, ముందు, సెల్ఫీల కోసం పాప్ అప్ సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది.  ఈ స్మార్ట్ఫోన్ 19.5: 9 ఆస్పెక్ట్ రేషియోతో మరియు 91.9 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తాయి. ఇది అత్యదికంగా 600 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది.  ఈ రెడ్మి K20 ప్రో యొక్క డిస్ప్లే యూట్యూబ్, Netflix మరియు PUBG వంటి వాటిలో HDR కంటెంటుకు మద్దతిస్తుందని కంపెనీ పేర్కొంది.  ఈ ఫోన్ యొక్క డిస్ప్లే ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తక్షణతో అందించబడింది. అలాగే, వెనుక భాగంలో ఒక 3D కర్వ్డ్ గ్లాస్ డిజైన్ అందించింది.      

Redmi K20 Pro Battery

ఈ ప్రో వేరియంట్ AI సహాయంతో దాని బ్యాటరీ పనితీరును పెంచే స్మార్ట్ ఆప్టిమైజేషనుతో వస్తుంది. ఇక ఛార్జింగ్ మరియు బ్యాటరీ విషయాలకు వస్తే,  ఇందులో 27 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో 4000 mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, బాక్స్ లో మాత్రం కేవలం 18వాట్స్ చార్జరును మాత్రమే అందించింది.

అదనంగా, ఈ స్మార్ట్ ఫోన్స్  ఒక 3.5 mm జాక్ మరియు రెడ్మి K20 ప్రో స్మార్ట్ఫోన్ ఒక స్నాప్డ్రాగెన్ 855 చిప్సెట్టుతో వస్తుంది. ఇది గరిష్టంగా, 2.84GHz వరకు క్లాక్ స్పీడును అందిస్తుంది. ఈ ఫోన్ AnTuTu పైన 3,88,803 స్కోరును సాధించినట్లు, షావోమి ప్రకటించింది.

Redmi K20 Pro Camera

ఈ  స్మార్ట్ ఫోను యొక్క వెనుక భాగంలో ఒక ట్రిపుల్ కెమేరా సెటప్పును  అందించింది. Sony IMX 586 సెన్సారుతో 48MP కెమేరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా ఇందులో వ్వబడింది. అలాగే, ఇది 8MP టెలిఫోటో లెన్స్ మరియు 13MP వైడ్ – యాంగిల్  లెన్స్ కలిగి ఉంది. ఈ కెమెరాలో అందించిన టెలిఫోటో కెమేరాతో 2X ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. ముందు కెమెరా విషయానికి వస్తే, 20 MP  సెల్ఫీ కెమేరా ఒక పాప్-అప్ మెకానిజంతో వస్తుంది. ఈ సెల్ఫీ కెమేరా ఒక కెమేరా ఎడ్జ్ లైటింగ్ సిస్టం తో వస్తుంది. ఇది కార్బన్ బ్లాక్, ఫ్లేమ్ రెడ్ మరియు గ్లేసియర్ బ్లూ వంటి మూడు రంగుల ఎంపికలతో లభిస్తుంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo