Flipkart Big Saving Days 2023 సేల్ నుండి ఈరోజు మంచి 5G మొబైల్ అఫర్ అందుబాటులో వుంది. చాలా తక్కువ ధరకే Samsung బ్రాండ్ యొక్క లేటెస్ట్ బెస్ట్ 5G మొబైల్ ను మీ సొంతం చేసుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ తన బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి అందించింది. Samsung Galaxy S23 5G స్మార్ట్ ఫోన్ పైన అందించిన ఆఫర్ గురించే మనం మాట్లాడకుంటుంది. ఈ లేటెస్ట్ శామ్సంగ్ 5G మొబైల్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి చాలా తక్కువ ధరకే లభిస్తుంది. మరి ఈ ఫోన్ యొక్క డీల్ ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
Samsung Galaxy S23 5G: డీల్
శామ్సంగ్ గెలాక్సీ S23 5G స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ (4GB+64GB)ఈరోజు కేవలం రూ.13,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను Citi మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి 1,000 రూపాయల వరకూ అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ల ద్వారా ఈ ఫోన్ ను కేవలం రూ.12,999 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ F23 5G స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల FHD+ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 750G 5G చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది మరియు One UI 4.1 సాఫ్ట్ వేర్ తో వుంటుంది.
కెమెరాల పరంగా, ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇవ్వబడింది. ఇందులో, 50ఎంపీ మైన్ కెమెరాకి జతగా 8ఎంపి అల్ట్రా వైడ్ డెప్త్ మరియు 2ఎంపీ డెప్త్ కెమెరా ఉంటుంది. ఇక సెల్ఫీల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 8ఎంపీ సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ బాక్స్ తో పాటుగా ఛార్జర్ ను మాత్రం శామ్సంగ్ అందించదు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile