Flipkart Sale: 48MP ట్రిపుల్ కెమెరా ఫోన్ రూ.7,999 అఫర్ ధరకే..!!

HIGHLIGHTS

Flipakrt Big Bachat Dhamaal సేల్ నుండి భారీ డీల్

48MP ట్రిపుల్ కెమేరా ఫోన్ కేవలం రూ.7,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది

ఈ ఫోన్ పైన మరిన్ని ఆఫర్లు కూడా అందుకోవచ్చు

Flipkart Sale: 48MP ట్రిపుల్ కెమెరా ఫోన్ రూ.7,999 అఫర్ ధరకే..!!

ఈరోజు నుండి మొదలైన Flipakrt Big Bachat Dhamaal సేల్ నుండి భారీ డీల్స్ అఫర్ చేస్తోంది. ఈ సేల్ నుండి మోటోరోలా యొక్క లేటెస్ట్ 48MP ట్రిపుల్ రియర్ కెమేరా స్మార్ట్ ఫోన్ కేవలం రూ.7,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పైన మంచి బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ మోటో ఫోన్ ఏమిటి ఈ ఫోన్ అందించిన డీల్ మరియు ఆఫర్ల పైన ఒక లుక్కేయండి.            

Digit.in Survey
✅ Thank you for completing the survey!

మోటోరోలా గత సంవత్సరం 10 వేల సబ్ కేటగిరిలో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ Moto e40 ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ ఫోన్ అఫర్ క్రింద చూడవచ్చు. 

Moto e40: ధర&ఆఫర్స్ 

Moto e40 స్మార్ట్ ఫోన్ 4GB మరియు 64GB స్టోరేజ్ తో ధర Rs.9,499 ధరతో లాంచ్ చేయబడింది. ఈ రోజు ఫ్లిప్ కార్ట్ నుండి 1,500 రూపాయల్ భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.7,999 రూపాయలకే లభిస్తోంది. ఈ ఫోన్ ను IDFC మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ క్రెడిట్  కార్డ్ మరియు EMI తో కొనేవారికి 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.         

Moto e40: స్పెషిఫికేషన్స్

Moto e40 పెద్ద 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేని పంచ్ హోల్ డిజైన్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు 20:9 ఎస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఈ ఫోన్ Unisoc T700 ఆక్టా కోర్ చిప్ సెట్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా వేగవంతమైన LPDDR4X 4GB ర్యామ్ మరియు పెద్ద 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. నీటి తుంపర్ల నుండి రక్షణ కోసం ఈ ఫోన్ IP52 వాటర్ రేపెళ్లేంట్ డిజన్ తో అందించబడింది.    

ఇక కెమెరా పరంగా, Moto e40 ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంటుంది. ఇందులో, 48MP మైన్ కెమెరా మరియు 2MP మ్యాక్రో మరియు 2MP డెప్త్ కెమెరా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ 11 తో వస్తుంది మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ మరియు ఫేస్ అన్లాక్ కూడా కలిగి ఉంటుది. ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీని అందించింది. ఈ ఫోన్ లో డేడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్ ను కూడా ఇచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo