ఈ రోజుతో ముగియనున్న Flipkart Year End Sale : ఇవే బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఆఫర్లు

HIGHLIGHTS

బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో టాప్ 5 స్మార్ట్ ఫోన్లను ఇక్కడ అందిస్తున్నాను.

Flipkart 2019 సంవత్సరం చివరి సేల్ గా తన "Year End Sale" ని ప్రకటించింది. అయితే, ఈ సేల్ ఈరోజుతో ముగియనుంది. అందుకోసమే, ఈ సేల్ నుండి అనేకమైన స్మార్ట్ ఫోన్ల పైన మంచి ఆఫర్లను అందిస్తోంది. అంతేకాదు, అన్ని స్మార్ట్ ఫోన్ల పైన ICICI బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10% తక్షణ డిస్కౌంట్ అందిస్తోంది. ఇక ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో అమ్ముడవుతున్న ట్రెండీ మరియు బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో టాప్ 5 స్మార్ట్ ఫోన్లను ఇక్కడ అందిస్తున్నాను.                      

1. Moto E6s

ఇది ఒక 6.1 అంగుళాలసూపర్ IPS LCD ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. ఇది వెనుక భాగంలో 13MP+2MP  డ్యూయల్ కెమెరాతో పాటుగా ముందు 8MP సెల్ఫీ కెమేరాతో అందించబడింది మరియు ఇది ఒక మంచి డిజన్ తో వస్తుంది. అలాగే ఒక 3,000 mAh బ్యాటరీ ఇందులో అందించింది. ఈ ఫోన్, ఒక మీడియా టెక్ హీలియో P22 ఆక్టా కోర్ ప్రొసెసర్ శక్తితో 4GB ర్యామ్ జతగా వస్తుంది.  ఈ ఫోన్, పోలిష్డ్ గ్రాఫైట్, కరేబియన్ బ్లూ, రిచ్ క్రాన్ బెర్రీ వంటి మూడు అంధమైన రంగులలో లభిస్తుంది. ఈ స్మార్ట్  ఫోన్ను Flipkart నుండి  Amazon నుండి కేవలం రూ. 5,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.

2. REDMI NOTE 7 PRO

ఇండియాలో మిడ్ రేంజ్ ధరలో ఒక 48MP ప్రధాన కెమేరా, అదీకూడా SONYIMX586 సెన్సారుతో ఒక స్మార్ట్ ఫోన్, కేవలం షావోమి మాత్రమే అందించింది. కేవలం, కెమేరా మాత్రమే కాదు ఒక స్నాప్ డ్రాగన్ 675 ప్రాసెసరుతో మంచి స్పీడ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB మరియు 6GB వంటి ర్యామ్ ఎంపికలతో కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్నుఈ రోజు ముగియనున్న Flipkart సేల్ నుండి కేవలం రూ. 14,990 ధరతో కొనుగోలు చేయవచ్చు.      

3. REALME 5 PRO

రియల్మీ 5 ప్రో స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.3 అంగుళాల వాటర్ నోచ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 90.8%  స్క్రీన్-టూ-బాడీ రేషియో మరియు FHD+ రిజల్యూషన్ అందిస్తుంది. ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 712 ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 616 మరియు 4GB మరియు 6GB ర్యామ్ శక్తితో వస్తుంది. 48MP+8MP+MP+2MP  క్వాడ్ రియర్ కెమేరాతో ఉంటుంది. అలాగే,ముందు ఒక 16MP సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్నుఈ రోజు ముగియనున్న Flipkart సేల్ నుండి కేవలం రూ. 11,990 ధరతో కొనుగోలు చేయవచ్చు.  

4. SAMSUNG GALAXY A50

ఈ శామ్సంగ్ గెలాక్సీ A50 స్మార్ట్ ఫోన్ ప్రీమియంగా ఉంటుంది.  ఈ ఫోన్ ఒక  6.4 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. ఇది వెనుక 8MP+25MP +5MP  ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును కలిగి ఉంటుంది. A50  స్మార్ట్ ఫోన్ ఒక Exynos 9610 ఆక్టా – కోర్ ప్రాసెసర్ మరియు జతగా 6GB ర్యామ్ శక్తితో నడుస్తుంది. ఇది ఒక 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయగల ఒక 4,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్  ఫోన్ను ఈరోజు ముగియనున్న Flipkart సేల్ నుండి కేవలం రూ. 14,990 ధరతో కొనుగోలు చేయవచ్చు.              

5. Vivo Z1X

ఈ వివో Z1 X స్మార్ట్ ఫోన్ 2340 x 1080 పిక్సెళ్ళ రిజల్యూషన్ అందించగల ఒక 6.38 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో అందించబడుతుంది. అలాగే, ఇది ఒక స్నాప్ డ్రాగన్ 712AIE ఆక్టా కోర్ ప్రొసెసరుతో నడుస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక భారీ 4,500 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే, ఇది 4GB ర్యామ్ జతగా 128GB వేరియంట్ మరియు మరొక 6GB ర్యామ్ జతగా 128GB వేరియంట్తో వస్తుంది. వెనుక భాగంలో 48MP +8MP+2MP  ట్రిపుల్ కెమేరా సేటప్పుతో వస్తుంది. ఈ స్మార్ట్  ఫోన్ను ఈరోజు ముగియనున్న Flipkart సేల్ నుండి కేవలం రూ. 14,990 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :