అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ ఫోన్ల యోక్క రేడియేషన్ వాల్యూ లేదా SAR వాల్యూ ఏంటో తెలుసా

HIGHLIGHTS

ప్రస్తుతం, భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న మరియు అత్యధికంగా అమ్ముడవుతున్న10 స్మార్ట్‌ఫోన్‌ల యోక్క రేడియేషన్ స్థాయిని ఇక్కడ పరిశీలించండి.

అత్యధికంగా అమ్ముడవుతున్న ఈ ఫోన్ల యోక్క రేడియేషన్ వాల్యూ లేదా SAR వాల్యూ ఏంటో తెలుసా

ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, పెద్ద స్క్రీన్, పెద్ద బ్యాటరీలు మరియు గొప్ప కెమెరాలతో వివిధ రకాలలైన ఇతర ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి.  వినియోగధారలు కూడా అనేకమైన ఎంపికలో వారికీ నచ్చిన మంచి స్మార్ట్ ఫోన్లను ఎంచుకునేలా, ప్రస్తుతం స్మృతి ఫోన్ తయారీ సంస్థలు ఫోన్లను తీసుకురావడం కూడా గొప్ప విషయమని చెప్పాలి. అయితే, మీరు ముఖ్యంగా ఒక విషయాన్ని మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు అని అనుకుంటున్నాను. అన్ని స్మార్ట్ ఫోన్లు, కెమెరాలు, ప్రాసెసర్లు, బ్యాటరీలు మరియు డిస్ప్లేల వంటివి నవచ్చినతరువాత మీరు గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే,  రేడియేషన్ స్థాయి లేదా SAR  Value.  ప్రస్తుతం, భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న మరియు అత్యధికంగా అమ్ముడవుతున్న10 స్మార్ట్‌ఫోన్‌ల యోక్క రేడియేషన్ స్థాయిని ఇక్కడ పరిశీలించండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. శామ్‌సంగ్ గెలాక్సీ M 30

ఈ స్మార్ట్‌ఫోన్ 6.4-అంగుళాల సూపర్ అమోలాడ్ FHD + ఇన్ఫినిటీ U డిస్‌ప్లేతో పనిచేస్తుంది. అంతర్గత స్పెసిఫికేషన్లలో 4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 6 జిబి ర్యామ్ & 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. అలాగే, ఈ స్మార్ట్‌ ఫోనులో గొప్ప కెమెరాలు కూడా ఉన్నాయి.

Head SAR: 0.409 W / Kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

2. శామ్‌సంగ్ గెలాక్సీ A 70

ఈ స్మార్ట్‌ఫోన్ 6.70-అంగుళాల సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది .ఇది మీకు చాలా మంచి పనితీరును ఇచ్చే ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు UI ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తాయి.

Head SAR: 0.774 W / Kg

Body SAR: N /A

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

3. శామ్‌సంగ్ గెలాక్సీ M 20

ఈ స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల అమోలాడ్ FHD + ఇన్ఫినిటీ U డిస్‌ప్లేతో పనిచేస్తుంది. అంతర్గత స్పెసిఫికేషన్లలో 4 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్, 3 జిబి ర్యామ్ & 32 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. అలాగే, ఈ స్మార్ట్‌ ఫోనులో గొప్ప కెమెరాలు కూడా ఉన్నాయి.

Head SAR: 0.248 W / Kg

Body  SAR : 1.591 W / Kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

4. వివో వి 15 ప్రో

స్మార్ట్ఫోన్ 6.39-అంగుళాల డిస్ప్లేతో పనిచేస్తుంది . ఇది అల్ట్రా ఫుల్ వ్యూ సూపర్ అమ్లోడ్ ప్యానెల్ తో వస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ 1080×2340 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంది .ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ తో నడుస్తుంది. 48 మెగాపిక్సెల్ + 5-మెగాపిక్సెల్ వెనుక కెమెరాలు మరియు 32-మెగాపిక్సెల్  పాప్ అప్ సెల్ఫీ కెమెరాని కలిగివుంటుంది.

Head  SAR: 1.15W / kg

Body  SAR: 0.284W / kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

5. షావ్మి రెడ్‌మి నోట్ 7 ప్రో

ఈ స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల హెచ్‌డి + ఎల్‌టిపిఎస్ డిస్‌ప్లేతో వస్తుంది .ఇవి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణ కలిగిఉంటుంది .ఇవి రెండు వేరియంట్లలో లభిస్తాయి. అలాగే, వెనుకభాగంలో ముద్రణ సెన్సార్, ఫేస్ అన్లాక్, మరియు దాని ఇతర ఫీచర్లను కలిగి ఉంటుంది.

Head  SAR: 0.962W / kg

Body  SAR: 0.838W / kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

6. OnePlus 6 T

ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.41-అంగుళాల పూర్తి HD ఆప్టిక్ AMOLED డిస్ప్లే మరియు గొప్ప వేగవంతమైన ప్రాసెసర్ కలిగి ఉంటుంది.ఇది 19.9 ఆస్పెక్టు రేషియాతో ఉంటుంది. ఈ ఫోన్ విడుదల సమయంలో స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసర్ కలిగి ఆమోదట ఫోనుగా నిలచింది మరియు ఆల్ టైం బెస్ట్ సెల్లార్ స్మార్ట్ ఫోనుగా పేరు పొందింది.  

Head  SAR: 1.552W / kg

Body  SAR: 1.269W / kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

7. హువావే యొక్క P 30 లైట్

హువావే యొక్క పి 30 లైట్ స్మార్ట్‌ఫోన్ ఒక 6.15-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో వస్తుంది .ఇది కిరిన్ 710 ప్రాసెసర్‌తో  నడుస్తుంది. అంతర్గత స్పెసిఫికేషన్లలో 4 & 6 జిబి ర్యామ్ మరియు 128 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ పై మీద పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లు ట్రిపుల్ రియర్ కెమెరాలతో పనిచేస్తాయి.ఇది 24 మెగాపిక్సెల్ + 8-మెగాపిక్సెల్ + 2-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉంది.

Head  SAR: 1.23W / kg

Body  SAR: 1.19W / kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

8. హానర్ 8 C

ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.26 అంగుళాల పెద్ద డిస్ప్లే  మరియు 1520 × 720 పిక్సెల్ రిజల్యూషన్ అందిస్తుంది. ఈ ఫోన్ క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా కోర్ ప్రోసిజర్ శక్తితో పనిచేస్తుంది మరియు 4GB ర్యామ్ కి జతగా 32/64GB ఎంపికలతో లభిస్తుంది. కెమెరాల పరంగా కూడా 13MP+2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు 8MP సెల్ఫీ కెమెరాని కలిగి ఉంటుంది.   

Head  SAR = 0.54 W / kg

Body  SAR: N/A

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

9. హానర్ 8 X స్మార్ట్‌ఫోన్‌లు

ఈ ఫోన్ ఒక 6.5 అంగుళాలు డిస్ప్లేతో ఉంటుంది. ఈ  స్క్రీన్‌తో 1080×2340 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది .అలాగే, ఇది కిరిన్ 710 ప్రాసెసర్ తో   నడుస్తుంది . ఇది ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ పై నడుస్తుంది. వెనుక డ్యూయల్ రియర్ కెమరాలు మరియు గొప్ప సెల్ఫీ కెమేరాను కలిగివుంటుంది. 

Head  SAR : 0.81 W / kg

Body  SAR : 1.02 W / kg

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

10. నోకియా 7.1 

ఈ నోకియా స్మార్ట్ ఫోన్ గొప్ప డిస్ప్లేతో వస్తుంది. ఇది ఒక 5.84 అంగుళాల FHD + ప్యూర్ డిస్ప్లే ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్  ఒక క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 636 ఆక్టా కొర్ ప్రాసెసర్ పైన నడుస్తుంది. ఇక ఇందులో అందించిన కెమెరాలు ZEISS ఆప్టిక్స్ తో వస్తాయి కాబట్టి గొప్ప క్వాలిటీ ఫోటోలను తీసుకోవచ్చు.    

Head  SAR : 0.312 W / kg

Body  SAR : N / A

భారతదేశంలో అనుమతించదగిన పరిమితి: 1.6 W / kg

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo