ఈ మూడు కెమేరా ఫోన్లను రూ.10,000 కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు
కేవలం రూ. 10,000 కంటే తక్కువ ధరలోనే ఏకంగా మూడు కెమెరాలతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేసాయి.
ఈ స్మార్ట్ ఫోన్లు కేవలం కెమెరాల పరంగా మాత్రమే కాకుండా, సెల్ఫీ కెమేరా, ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ మరియు వాటర్ డ్రాప్ నోచ్ వంటి ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్నాయి.
అన్ని ప్రధాన బ్రాండ్స్ కూడా వివిధ రకాల ప్రత్యేకతలతో తమ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. కొన్ని డ్యూయల్ కెమేరాలతో స్మార్ట్ ఫోన్లను తీసుకురాగా, మరికొన్ని కేవలం రూ. 10,000 కంటే తక్కువ ధరలోనే ఏకంగా మూడు కెమెరాలతో స్మార్ట్ ఫోన్లను విడుదల చేసాయి. ఈ స్మార్ట్ ఫోన్లు కేవలం కెమెరాల పరంగా మాత్రమే కాకుండా, సెల్ఫీ కెమేరా, ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ మరియు వాటర్ డ్రాప్ నోచ్ వంటి ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. అటువంటి ప్రత్యేకతలతో రూ.10,000 కంటే తక్కువ ధరలో లభించే స్మార్ట్ ఫోన్లను ఇప్పుడు చూద్దాం.
Survey1. Infinix Smart 3 Plus
ఈ స్మార్ట్ 3 ప్లస్ స్మార్ట్ ఫోన్ను కేవలం రూ.6,999 ధరతో మూడు కెమెరాలతో తీసుకొచ్చింది ఇన్ఫినిక్స్ సంస్థ. ఈ స్మార్ట్ ఫోన్, కేవలం ఇంత తక్కువ ధరలో మూడు కెమేరాలను మాత్రమే కాకుండా ఈ క్రింద తెలిపిన ట్రెండీ ఫీచర్లను కలిగి ఉంటుంది.
డిస్ప్లే : 6.21 అంగుళాలు
డిజైన్ : వాటర్ డ్రాప్ డిస్ప్లే
రిజల్యూషన్ : HD+ రిజల్యూషన్
వెనుక కెమేరా : 13MP + 2MP + Low Light ట్రిపుల్ కెమేరా
సెల్ఫీ కెమేరా : 8MP AI సెల్ఫీ కెమేరా
ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో A22 క్వాడ్ కోర్
ర్యామ్ : 2GB ర్యామ్
స్టోరేజి : 16GB అంతర్గత స్టోరేజి
బ్యాటరీ : 3,500 mAh బ్యాటరీ
2. Infinix S4
అదే ఇన్ఫినిక్స్ సంస్థ, ఈ S4 స్మార్ట్ ఫోన్ను కేవలం రూ.8,999 ధరతో మూడు కెమెరాలతో తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్, తక్కువ ధరలో మూడు కెమేరాలను మాత్రమే కాకుండా ఈ క్రింద తెలిపిన ట్రెండీ ఫీచర్లను కలిగి ఉంటుంది.
డిస్ప్లే : 6.21 అంగుళాలు
డిజైన్ : వాటర్ డ్రాప్ డిస్ప్లే
రిజల్యూషన్ : (1520x 720 ) HD+ రిజల్యూషన్
వెనుక కెమేరా : 13MP + 2MP డెప్త్ సెన్సార్ + 8MP వైడ్ యాంగిల్ సెన్సార్ గల ట్రిపుల్ కెమేరా
సెల్ఫీ కెమేరా : 32MP AI సెల్ఫీ కెమేరా
ప్రాసెసర్ : 2.0GHz మీడియాటెక్ హీలియో P 22 ఆక్టా కోర్
ర్యామ్ : 3GB ర్యామ్
స్టోరేజి : 32GB అంతర్గత స్టోరేజి
బ్యాటరీ : 4,000 mAh బ్యాటరీ
3. Techno Camon I4
టెక్నో సంస్థ నుండి కేవలం రూ.8,999 ధరతో మూడు కెమెరాలతో వచ్చినటువంటి ఈ Camon I4 మంచి ఫీచర్లను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్, తక్కువ ధరలో మూడు కెమేరాలను మాత్రమే కాకుండా ఈ క్రింద తెలిపిన ట్రెండీ ఫీచర్లను కలిగి ఉంటుంది.
డిస్ప్లే : 6.2 అంగుళాలు
డిజైన్ : వాటర్ డ్రాప్ డిస్ప్లే
రిజల్యూషన్ : (1520x 720 ) HD+ రిజల్యూషన్
వెనుక కెమేరా : 13MP + 2MP డెప్త్ సెన్సార్ + 8MP వైడ్ యాంగిల్ సెన్సార్ గల ట్రిపుల్ కెమేరా
సెల్ఫీ కెమేరా : 16 MP AI సెల్ఫీ కెమేరా
ప్రాసెసర్ : మీడియాటెక్ హీలియో A 22 క్వాడ్ కోర్
ర్యామ్ : 2GB ర్యామ్
స్టోరేజి : 32GB అంతర్గత స్టోరేజి
బ్యాటరీ : 3,500 mAh బ్యాటరీ