దీపావళి నుండి రిలయన్స్ కొత్త 4G స్మార్ట్ ఫోన్స్ సేల్
రిలయన్స్ Jio నుండి కొత్త బ్రాండింగ్ తో 4G స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. ఇది చాలా కాలం నుండి వినిపిస్తున్న వార్త. అయితే తాజాగా రిలయన్స్ Jio వీటిని ఈ దీపావళి కు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Surveyఇవి "Lyf" అనే బ్రాండ్ పేరుతో మార్కెట్ లోకి వచ్చే అతి తక్కువ 4G స్మార్ట్ ఫోన్స్ అని రిపోర్ట్స్. ఈ ప్రాజెక్ట్ కోసం కంపెని 5 OEM హాండ్ సెట్ తయారీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. నవంబర్ నెలలో మార్కెట్ లోకి వస్తాయి.
రిలియన్స్ jio మొబైల్ నెట్వర్క్ తో సొంత 4G ఇంటర్నెట్ సర్విస్ లను స్టార్ట్ చేసి, సొంత Lyf బ్రాండింగ్ మొబైల్ హాండ్ సెట్స్ లో అందిస్తుంది. అంటే ఇంటర్నెట్ బేస్డ్ కాలింగ్ కూడా సపోర్ట్ చేస్తాయి ఇవి.
అతి తక్కువ 4G హాండ్ సెట్ అయినప్పటికీ ఇవి పెర్ఫార్మెన్స్ లో కూడా పవర్ ఫుల్ గా ఉంటాయి అని కంపెని ప్రోమోట్ చేస్తుంది. LTE మరియు WiFi వాయిస్ కాల్స్ అండ్ HD డిఫాల్ట్ వీడియో కాలింగ్ కు కూడా పనిచేస్తుంది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile