Coolpad బడ్జెట్ సెగ్మెంట్ లో రెండు కొత్త ఫోన్స్ Coolpad A1 మరియు Coolpad Mega 4A లను విడుదల చేసింది, ఈ స్మార్ట్ఫోన్ లు ఆన్లైన్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి. కూల్పాడ్ A1 మరియు కూల్పాడ్ మెగా 4A ధరలు వరుసగా రూ .5,499 మరియు రూ .4,299. కూల్పాడ్ A1 స్మార్ట్ఫోన్ ఒక 5 అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది, ఇది ఒక కర్వ్డ్ బ్యాక్ తో వస్తుంది మరియు ఇది గోల్డ్ కలర్ ఫినిష్ తో ఇవ్వబడింది.డివైస్ వెనుక 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అయితే ఈ డివైస్ 5 మెగాపిక్సెల్ కెమెరా సెల్ఫీస్ కోసం అందుబాటులో ఉంటుంది.
Coolpad A1 Android 7.1 నౌగాట్ లో పనిచేస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ లు ఏప్రిల్ 12 నుండి 3,000 మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్స్ అందుబాటులో ఉంటాయి, వీటిలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, హర్యానా మరియు ఢిల్లీ NCR లో స్టోర్స్ ఉన్నాయి.
Snapdragon 210 1.1Ghz క్వాడ్-కోర్ చిప్సెట్, 2GB RAM, 16GB స్టోరేజ్ మరియు 2,500 mAh బ్యాటరీ కలిగి ఉంది. కూల్ప్యాడ్ మెగా 4A 5 అంగుళాల ఫుల్ HD డిస్ప్లేని కలిగి ఉంది, ఈ డివైస్ 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా మరియు ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ తో పనిచేస్తుంది. స్ప్రెడ్ట్రమ్ SC 9832 చిప్సెట్ ని కలిగి ఉంది, ఇది 1.3GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్. 1GB RAM మరియు 16GB స్టోరేజ్ మరియు 2,000mAh బ్యాటరీ అమర్చారు. ఏప్రిల్ 12 న పైన పేర్కొన్న రాష్ట్రాల్లో ఈ పరికరం అందుబాటులో ఉంటుంది.