CMF Phone 2 Pro 5G ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసిన నథింగ్.!

HIGHLIGHTS

CMF Phone 2 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ తో టీజింగ్

ఈ ఫోన్ ప్రత్యేకతలు ఒకొక్కటిగా విడుదల చేస్తోంది

సిఎంఎఫ్ ఇప్పుడు కెమెరా వివరాలు వెల్లడించింది

CMF Phone 2 Pro 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ తో టీజింగ్ చేస్తున్న నథింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు ఒకొక్కటిగా విడుదల చేస్తోంది. ఈ ఫోన్ స్క్రీన్ మరియు చిప్ సెట్ గురించి వెల్లడించిన సిఎంఎఫ్ ఇప్పుడు కెమెరా వివరాలు వెల్లడించింది. ఈ ఫోన్ లాంచ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ స్మార్ట్ ఫోన్ వివరాలు త్వరగా వెల్లడిస్తోంది.

CMF Phone 2 Pro 5G : ఫీచర్స్

సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 7300 Pro చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ గతంలో వచ్చిన సిఎంఎఫ్ ఫోన్ 1 కంటే 105 వేగవంతమైన CPU మరియు 5% గ్రాఫిక్స్ ఇంప్రూవ్మెంట్ తో ఉంటుందని కూడా నథింగ్ తెలిపింది. ఈ ఫోన్ 120 FPS తో BGMI ని ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 53% అదనపు నెట్వర్క్ బూస్ట్ మరియు 1000 Hz టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఆఫర్ చేస్తుందని నథింగ్ ప్రకటించింది.

ఇక కొత్త నథింగ్ ఈ అప్ కమింగ్ ఫోన్ కోసం అందించిన కొత్త అప్డేట్ ద్వారా ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఫోన్ ను 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో (2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్) కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరాతో లాంచ్ చేస్తోంది.

ఈ ఫోన్ కెమెరా ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ కలిగిన మొదటి ఫోన్ అవుతుందని కూడా నథింగ్ చెబుతోంది. అంతేకాదు, ఈ ఫోన్ చిత్రీకరించిన ఫోటోలతో కూడా టీజింగ్ చేస్తోంది.గత ఫోన్ తో పోలిస్తే, ఈ ఫోన్ కెమెరా మరింత అప్గ్రేడ్ అయినట్లు క్లియర్ గా కనిపిస్తోంది. అంతేకాదు, ఫోన్ కెమెరా డిజైన్ లో కూడా చాలా మార్పు కనిపిస్తుంది.

Also Read: Infinix Note 50s 5G: చవక ధరలో కర్వుడ్ స్క్రీన్ తో సహా భారీ ఫీచర్స్ తో వచ్చింది.!

ఇక ఫోన్ డిజైన్ పరంగా చాలా స్లీక్ గా ఉంటుందని కూడా సిఎంఎఫ్ తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ సరికొత్త బ్యాక్ ప్యానల్ డిజైన్ మరియు స్లీక్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్స్ కూడా త్వరలోనే అందిస్తుందని వెల్లడించింది. ఈ ఫోన్ కొత్త ఫీచర్స్ మరియు అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :