అత్యంత చౌకైన Punch-Hole డిస్ప్లే ఫోన్ Infinix S5 మొదటి సేల్

HIGHLIGHTS

ఇందులో చాలా గొప్ప 3D యూనిబాడి డిజనుని కూడా అందించారు.

ఇటీవల, ఇన్ఫినిక్స్ S5 స్మార్ట్ ఫోన్నుచాల చౌకధరలో ఒక 32MP పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా,వెనుక  క్వాడ్ రియర్ కెమెరా సెటప్,  4000mAh బ్యాటరీ వంటి గొప్ప స్పెక్స్ తో, భారతదేశంలో కేవలం రూ.8,999 ధరతో ఇండియా మార్కెట్లో లాంచ్ చేసి, అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, అంతకంటే ఇంకా తక్కువ ధరలో Infinix S5 Lite స్మార్ట్ ఫోన్ను అదే పంచ్ హోల్ డిజైన్ మరియు ట్రిపుల్ కెమేరాతో ఈరోజు లాంచ్ చేసింది. ఈ ఫోన్ను కేవలం 7,999 రూపాయల ధరలతో ఇండియాలో లాంచ్ చేసింది.    

Infinix S5 Lite ధర మరియు ఆఫర్లు

Infinix S5 Lite (4GB + 64GB ) – కేవలం రూ.7,999 మాత్రమే        

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్,  నవంబర్ 22 వ తేది మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుంది. ఆఫర్ల విషయానికి వస్తే, HDFC బ్యాంక్ డెబిట్ కార్డుతో కొనేవారికి 10% క్యాష్ బ్యాక్ అందుతుంది మరియు Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు &Axis బజ్ క్రెడిట్ కారుతో కొనేవారికి 5% డిస్కౌంట్ లభిస్తుంది.      

Infinix S5 Lite ప్రత్యేకతలు

ఈ Infinix S5 lite స్మార్ట్ ఫోన్  ఒక 6.6 అంగుళాల HD+ IPS పంచ్ హోల్ డిజైనుతో మరియు 720X1520 p రిజల్యూషనుతో వస్తుంది మరియు .ఇది 480 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది. అంతేకాదు , ఇది ఒక 20:9 ఆస్పెక్ట్ రేషియోని కలిగిన పెద్ద స్క్ర్రీనుతో వస్తుంది.  ఇక ఇందులో చాలా గొప్ప 3D యూనిబాడి డిజనుని కూడా అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 ఫై మీద ఆధారితంగా XOS 5.5 చీతా తో ప్రారంభించింది మరియు ఈ పూర్తి డివైజ్ మొత్తానికి పవర్ అందించాడని ఒక పెద్ద 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 2.0Ghz వరకూ క్లాక్ అందించగల ఒక Helio P22 Octa-core 64-bit ప్రాసెసరుతో వస్తుంది. దీనికి జతగా, 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజ్ అనుసంధానంతో వస్తుంది.అధనంగా 256GB స్టోరేజిని ఒక మెమొరీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు మరియు డ్యూయల్ VoLTE కి సపోర్ట్ చేస్తుంది.

ఈ  Infinix S5 Lite కెమేరా ఉష్యానికి వస్తే,  వెనుకభాగంలో  ఒక ప్రధాన 16 మెగాపిక్సెల్ (f1.8) కెమేరాకి జతగా ఒక 2MP వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటుగా మరొక Low Light సెన్సార్ తో జతగా కలిపిన ఒక  ట్రిపుల్ రియర్ కెమేరాని ఇందులో అందించారు. ఆటో సీన్ డిటెక్షన్, AI పోర్ట్రైట్, AI HDR, AI బ్యూటీ, AI Bokeh మరియు నైట్ షాట్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ముందుభాగంలో సెల్ఫీల కోసం  ఒక 16-MP AI కెమెరాని  కలిగి ఉంది, దీని ఎపర్చరు f2.0 గా ఉంటుంది.

అధనపు ఫీచర్ల విషయానికి వస్తే, డివైజ్ కనెక్టివిటీ, 3.5mm ఆడియో జాక్, FM , OTG, ట్రిపుల్ సిమ్ స్లాట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఫింగర్ ప్రింట్ మరియు ఫేస్ అన్లాక్ ఫీచరుతో కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్నుక్వజల్ షాన్, మిడ్నైట్ బ్లాక్ మరియు పర్పల్ వంటి కలర్ ఎంపికల్లో కొనుగోలు చేయవచ్చు.             

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :