Poco M2 ఇండియాలో కేవలం బడ్జెట్ ధరలో 6GB ర్యామ్ తో వచ్చిన స్మార్ట్ ఫోనుగా నిలుస్తుంది. అలాగే, పోకో M2 బడ్జెట్ విభాగం కోసం రూపొందించబడింది మరియు FHD + స్క్రీన్, అధిక-సామర్థ్యం గల బ్యాటరీ, నీటి-నిరోధక నిర్మాణం వంటి ఫీచర్స్ తో వస్తుంది. అంతేకాదు, భారతదేశంలో ఆగస్టులో ప్రారంభించిన రెడ్మి 9 ప్రైమ్ తో ఈ Poco M2 చాలా ఫీచర్లను పోలివుంటుంది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి Flipakrt నుండి మొదలవుతుంది.
Survey
✅ Thank you for completing the survey!
Poco M2 Price
పోకో M2 యొక్క 6 జిబి ర్యామ్ మరియు 64 జిబి స్టోరేజ్ తో వచ్చిన బేస్ వేరియంట్ ధరను కేవలం రూ .10,999 రూపాయలుగా ప్రకటించింది మరియు 128 జిబి స్టోరేజ్ వేరియంట్ కు రూ .12,499 ధరను ఫిక్స్ చేసింది. ఈ M2 స్మార్ట్ ఫోన్ బ్రిక్ రెడ్, పిచ్ బ్లాక్ మరియు స్లేట్ బ్లూ అనే మూడు రంగులలో లభిస్తుంది.
పోకో M2 లో పెద్ద 6.53-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే, సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్తో ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 గ్లాస్ రక్షణతో వస్తుంది మరియు వేలిముద్ర సెన్సార్ కెమెరా మాడ్యూల్ క్రింద ఉంది. పోకో M2 లో P2i స్ప్లాష్ మరియు రస్ట్ ప్రొటెక్షన్ కూడా అందించారు.
ఈ M2 స్మార్ట్ ఫోన్, MediaTek Helio G80 ప్రాసెసర్ ఆక్టా-కోర్ సిపియు మరియు మాలి-జి 52 GPU తో కలిగి ఉంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. ఈ ఫోన్ స్టోరేజ్ విస్తరణ కోసం ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 10 లో నడుస్తుంది మరియు త్వరలో MIUI 12 కు అప్ డేట్ చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.
పోకో M2 వెనుక భాగంలో నాలుగు కెమెరాల సెట్ అంటే క్వాడ్ కెమేరా ఇవ్వబడింది. ఇందులో, 13MP ప్రాధమిక కెమెరా, 118-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూతో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5MP మాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక ముందు వైపు, 8MP సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్ లోపల ఉంది.
M2 లో 5,000WAh బ్యాటరీ అమర్చబడి వుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.