BSNL vs JIO : 2020 న్యూ ఇయర్ బెస్ట్ అఫర్.

BSNL vs JIO : 2020 న్యూ ఇయర్ బెస్ట్ అఫర్.
HIGHLIGHTS

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్లు మంచి ప్రయోజనాలతో వస్తాయి.

రానున్న కొత్త సంత్సరం 2020 సందర్భంగా అన్ని ప్రధాన టెలికం సంస్థలు కూడా వాటి ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అయితే, BSNL మరియు JIO ప్రకటించినటువంటి, 2020 న్యూ ఇయర్ బెస్ట్ అఫర్ గురించి ఈ రోజు వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే, ఈ రెండు టెలికంలు ప్రకటించినటువంటి ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్లు మంచి ప్రయోజనాలతో వస్తాయి.

BSNL vs JIO : ధరలు

ఈ రెండు టెలికం సంస్థల ఆఫర్ ప్లాన్ల ధరలను చూస్తే, Jio యొక్క  2020 న్యూ ఇయర్ బెస్ట్ అఫర్ రూ. 2020. ఇక BSNL గురించి చూస్తే, BSNL యొక్క 2020 న్యూ ఇయర్ బెస్ట్ అఫర్ రూ.1,999 రూపాయల ధరలో వస్తుంది.     

BSNL vs JIO : టాక్ టైం

ముందుగా, ఈ రెండు టెలికం సంస్థలు  అందిస్తున్న కాలింగ్ ప్రయోజనాలను పరిశీలిద్దాం. ముందుగా జియో విషయానికి వస్తే, ఈ రూ.2020 లాంగ్ టర్మ్ ప్లానుతో జియో నుండి జియో కి అన్లిమిటెడ్ కాలింగ్ అందుకోవచ్చు మరియు ఇతర నెట్వర్క్ కాలింగ్ కోసం 12,000 నిముషాల FUP పరిమితితో కాలింగ్ సంశయాన్ని సమయాన్ని అందుకుంటారు. మరొక పైపు BSNL విషయానికి వస్తే, ఈ రూ.1,999 రుపాయల లాంగ్ టర్మ్ ప్లానుతో అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు దీనికి ఎటువంటి FUP పరిమితి లేదు.

BSNL vs JIO : డేటా మరియు SMS ప్రయోజనాలు

BSNL రూ.1,999 ప్లానుతో రోజుకు 3GB డేటా అందుతుంది మరియు రోజుకు 100 SMS లు లభిస్తాయి. ఇక జియో యొక్క ప్రయోజాల విషయానికి వస్తే, జియో యొక్క రూ.2020 ప్లానుతో రోజుకు 1.5GB హై స్పీడ్ డేటా మరియు 100 SMS లు లభిస్తాయి. ఈ రెండు టెలికం సంస్తలు కూడా పూర్తి వ్యాలిడిటీ కి గాను ఈ ప్రయోజనాలను అందిస్తున్నాయి.

BSNL vs JIO : వ్యాలిడిటీ మరియు అదనపు ప్రయోజనాలు

BSNL రూ.1,999 ప్లాను పూర్తిగా 425 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు 365 రోజులకు గాను BSNL TV సబ్ స్క్రిప్షన్ మరియు కాలర్ ట్యూన్ సౌలభ్యంతో వస్తుంది. ఇక జియో విషయానికి వస్తే, జియో యొక్క రూ.2020 ప్లాను 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది మరియు 365 రోజులకు గాను Jio యొక్క యాప్స్ కి కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ సౌలభ్యంతో వస్తుంది..

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo